‘చేయూత’ దరఖాస్తుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

‘చేయూత’ దరఖాస్తుల స్వీకరణ

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌/కోస్గి: చేయూత పింఛన్‌కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని నారాయణపేట పుర చైర్‌పర్సన్‌ కొండా శ్వేత, పుర కమిషనర్‌ శంకర్‌, కోస్గి పుర కమిషనర్‌ శ్రీకాంత్‌ బుధవారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, నేత కార్మికులు, ఇతర అర్హులైనా వారు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, సంబంధిత కేటగిరి ధ్రువపత్రాల జిరాక్స్‌ ప్రతులు జత చేయాలని సూచించారు. దరఖాస్తులను పుర కార్యాలయం లేదా సంబంధిత వార్డు అధికారికి అందజేయాలని కోరారు.

మాదక ద్రవ్యాలకు

దూరంగా ఉండాలి

నారాయణపేట ఎడ్యుకేషన్‌: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వింద్యానాయక్‌ సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రం సమీపంలోని ద్వారక పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, అవయవ దానం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆమెతో పాటు డీఎంహెచ్‌ఓ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకొచ్చే శక్తి కేవలం యువతకు మాత్రమే ఉందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ప్రభుత్వ చట్టాల మీద అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్థితో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098, మహిళా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 181, ఉచిత న్యాయ సాయం టోల్‌ఫ్రీ నంబర్‌ 15100, అత్యవసర సేవలు 112 నంబర్లు ఉండాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్‌ డా. జయచంద్రమోహన్‌ అవవయ దానం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఛీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ లక్ష్మీపతిగౌడ్‌, అడ్వొకేట్‌ నందూనామాజీ, ప్రిన్సిపాల్‌ అలేఖ్య, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement