న్యూస్‌రీల్
45 రోజుల ఆపరేషన్..
అసలు కథ ఇక్కడే..
జిల్లాలో ముగిసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్
● నారాయణపేట 84.92, మక్తల్ 84.27, కొడంగల్ 84.19 శాతం
● ఈసీకి తుది నివేదిక సమర్పణపై
అధికారుల కసరత్తు
● జిల్లాలో 7.46 లక్షల మంది
ఓటర్ల వివరాల పరిశీలన
● 829 మంది బీఎల్వోలు..
45 రోజుల పాటు...
బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026
–8లో u
ఓటరు జాబితా పకడ్బందీగా ఉంటేనే ప్రజా స్వా మ్య ప్రక్రియ మరింత పార దర్శకంగా ఉంటుంది. అందుకే ప్రతి ఓటరు వివరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ, వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది.
– సీహెచ్ ప్రియాంక, కలెక్టర్
మత్స్యకారులకు
రూ.5 లక్షల ప్రమాద బీమా
నారాయణపేట: మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం వద్ద స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాలో సభ్యత్వం కలిగిన సుమారు 12 వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతిచెందినా, శాశ్వత వైకల్యం పొందినా కుటుంబానికి రూ.5 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలు బీమా పరిహారం అందుతుందన్నారు. ప్రమాదవశాత్తు ఆస్పత్రిలో చికిత్స పొందిన సందర్భంలో వైద్యం కోసం గరిష్టంగా రూ.25 వేల వరకు చెల్లిస్తారని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి బీమా పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డికి జిల్లా మత్స్యకారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
85.590 మి.యూ.
విద్యుదుత్పత్తి
ఆత్మకూర్:ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగు వ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో మంగళవా రం 10 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగింది. ఎగువ కేంద్రంలోని 6 యూనిట్ల ద్వా రా 234 మెగావాట్లు, 49.266 ఎంయూ, దిగు వ కేంద్రంలోని 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 36.324 ఎంయూ విద్యుత్ ఉత్పత్తి చేసి నట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 85.590 ఎంయూ వి ద్యుదుత్పత్తి చేసినట్లు చెప్పారు.ప్రస్తుతం 40, 537 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
నిందితులను
కఠినంగా శిక్షించాలి
గద్వాల: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో పీజీ వైద్యవిద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంకను ఢీకొట్టడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నారాయణపేట: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో కీలక ఘట్టమైన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, క్షేత్రస్థాయి పరిశీలన, డిజిటలైజేషన్ ప్రక్రి య జిల్లాలో ముగిసింది. మక్తల్‌లో 284, నారాయణపేటలో 270, కొడంగల్‌లో 275 మంది, మొత్తం 829 మంది బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పనిచేశారు. సేకరించిన వివరాలను క్రోడీకరించి అనర్హత, డూప్లికేట్, మృతిచెందిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను పరిశీలించి తుది నివేదికలను ఎన్నికల సంఘానికి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
కొడంగల్‌పై స్పెషల్ ఫోకస్..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి దశలోనూ పురోగతిని పర్యవేక్షిస్తూ బీఎల్వోల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేయించింది. 2,51,255 మంది ఓటర్లకుగాను 2,11,527 మంది వివరాలు డిజిటలైజ్ కాగా.. 84.19 శాతం ప్రక్రియ పూర్తయింది.
మక్తల్ నియోజకవర్గంలో.. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రా తినిథ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో 2, 52,801 మంది ఓటర్లుండగా.. 2,13,044 మంది వివరాలు డిజిటలైజ్ చేయడంతో 84.27 శాతం నమోదైంది.
నారాయణపేట ముందంజ.. నారాయణపేట ని యోజకవర్గం డిజిటలైజేషన్‌లో మిగతా నియోజకవర్గాల కంటే ముందంజలో నిలిచింది. మొత్తం 2,42 ,773 మంది ఓటర్లకుగాను 2,06,170 మంది వివరాలు ఆన్‌చేసి 84.92 శాతం ప్రక్రియ పూర్తి చేశారు.
డబుల్ ఓట్లు మరో సవాల్.. కొడంగల్‌లో 10, 182, నారాయణపేటలో 5,672, మక్తల్‌లో 4,314 మంది ఓట్లు డబుల్ ఎంట్రీగా గుర్తించారు. ఓటరు జాబితా ప్రక్షాళనలో ఇది కీలక అంశంగా మారింది.
ఈసీవైపు చూపు.. ఎన్యూమరేషనన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తవడంతో తదుపరి దశపై ఉత్కంఠ నెలకొంది. క్షేత్రస్థాయిలో మృతిచెందిన, వలస, డబుల్ ఓట్లు, అందుబాటులో లేని ఓటర్లు తదితర వివరాల ఆధారంగా ఎన్నికల సంఘానికి నివేదిక లు సమర్పించనున్నారు. అనంతరం వచ్చే మార్గదర్శకాల మేరకు తదుపరి ప్రక్రియ కొనసాగనుంది.
నారాయణపేటలో వివరాలు ఆన్‌లైన్ చేస్తున్న బీఎల్వోలు (ఫైల్)
మక్తల్ నియోజకవర్గం
మండలం బీఎల్వోలు ఓటర్లు డిజిటల్ తొలగింపు మృతి షిఫ్టింగ్
అమరచింత 26 23,080 20,701 2,379 622 1,476
ఆత్మకూర్ 35 31,500 26,859 4,641 993 2,782
కృష్ణా 29 22,439 18,012 4,427 628 3,577
మాగనూర్ 25 20,208 17,772 2,436 799 1,380
మక్తల్ 74 68,791 55,439 13,352 2,717 9,163
నర్వ 31 29,087 25,450 3,657 993 1,989
ఊట్కూర్ 51 46,768 39,113 7,655 1,813 4,755
మదనాపురం 4 2,022 1,836 286 62 73
మరికల్ 9 8,906 7,862 1,044 294 534
నారాయణపేట నియోజకవర్గం..
దామరగిద్ద 53 45,694 39,811 5,883 1,217 3,117
ధన్వాడ 39 30,864 26,593 4,271 787 2,408
కోయిల్‌కొండ 61 56,594 49,101 7,493 2,043 2,775
మరికల్ 27 24,617 20,314 4,303 787 3,045
నారాయణపేట 90 85,004 70,351 14,653 2,630 10,168
కొడంగల్ నియోజకవర్గం..
దౌల్తాబాద్ 46 41,328 34,551 6,764 1,840 1,784
మద్దూర్ 44 39,501 33,223 6,278 1,329 2,577
కొత్తపల్లి 18 16,972 14,537 2,345 555 1,039
కోస్గి 39 37,537 30,542 6,995 1,397 3,400
గుండుమాల్ 20 17,860 15,359 2,501 589 1,239
బొంరాస్‌పేట 38 32,858 28,448 4,410 1,029 1,723
దుద్యాల 29 25,094 21,072 4,022 820 2,262
కొడంగల్ 41 40,105 33,795 6,310 1,587 2,962
ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌తో కథ ముగియలేదు. డిజిటలైజ్ కాని వాటిలో మృతిచెందిన, డబుల్ ఎంట్రీ, అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరణించిన ఓటర్లు మక్తల్‌లో 8,921, కొడంగల్‌లో 9,146 మందిగా నమోదయ్యాయి. నారాయణపేటలోనూ వేలాది మంది ఉన్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. కాగా.. వలస వెళ్లిన, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. మక్తల్‌లో 25,729 మంది, నారాయణపేటలో 21, 508 మంది, కొడంగల్‌లో 16,986 మంది ఉన్నట్లు తెలిపారు.
మండలాల వారీగా వివరాలు ఇలా..
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ ప్రక్రియను జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఎల్వోలు సుమారు 45 రోజుల పాటు ఇల్లిల్లూ తిరిగి ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఎన్యూమరేషనన్ ఫారాల పంపిణీ, వివరాలు పూర్తి చేసిన తర్వాత సేకరించడంతో పాటు క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


