ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

Aug 12 2026 3:10 AM | Updated on Aug 12 2026 3:10 AM

మాగనూర్‌/కృష్ణా: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులుండే అవకాశం ఉన్నందున రైతులు పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.సక్రియానాయక్‌ సూచించారు. మంగళవారం కృష్ణా మండలంలోని ఆలంపల్లి, చేగుంట గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సుదర్శన్‌గౌడ్‌తో కలిసి తనిఖీ చేయడంతో పాటు మాగనూర్‌ రైతువేధికలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించాలని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ యాప్‌ ద్వారా ఎరువుల బుకింగ్‌ చేసుకోవాలన్నారు. రైతులు ఎరువులు బుక్‌ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే డీలర్లు ఆ సమస్యను పరిష్కరించాలని, అవసరమైతే ఓ వలంటీర్‌ను నియమించుకోవాలని, ప్రతి ఒక్కరు యాప్‌పై అవగాహన ఉండాలని కోరారు. ఎరువుల పంపిణీ, లభ్యత విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయశాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా రైతువేధిక ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకర వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాగనూరులో జరిగిన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుదర్శన్‌గౌడ్‌, ఏఈవో పవన్‌, రాధిక, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement