వందేళ్లకు పైగా చరిత్ర.. పెరుగుతున్న డిమాండ్
125 ఏళ్ల చరిత్ర..
నారాయణపేట చేనేత కార్మికులు 1900 సంవత్సరం నుంచే మగ్గాలపై పట్టు చీరలు నేస్తూ వస్తున్నాయి. తరం మారినా.. మగ్గం మారలేదు. డిజైన్‌న్ మారినా.. నాణ్యత మాత్రం తగ్గలేదు. నారాయణపేట పేరు చెబితే పట్టు చీర గుర్తొచేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
పాత డిజైన్లకు చెక్..
కాలం మారింది.. మహిళల అభిరుచులు మారాయి.. ఫ్యాషనన్ ట్రెండ్లు మారాయి. దీంతో నేతన్నలు తమ డిజైన్లను మార్చుకుంటున్నారు. టెంపుల్, చెక్స్, ప్లెయిన్, బార్డర్, బుట్టా, ఫుల్ టర్నింగ్ తదితర డిజైన్లలో చీరలను రూపొందిస్తున్నారు. సాంప్రదాయ రూపాన్ని కోల్పోకుండా ఆధునిక రంగులు, డిజైన్లను జోడిస్తున్నారు. యువతకు నచ్చే రంగులు, తేలికపాటి డిజైన్లకు ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది.
నారాయణపేట: ఆధునిక డిజైన్లు, ఫ్యాషన్‌కు అనుగుణంగా కాటన్, పట్టు చీరలు తయారు చేయడం పేట చేనేత కార్మికుడి ప్రత్యేకత. చేతిలోని నూలును మగ్గంపై నడిపిస్తూ రంగుల్ని కలగలిపి కళ్లు చెదిరే డిజైన్లను రూపొందిస్తూ పేట పట్టు చీరకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. ఒకప్పుడు సంప్రదాయ డిజైన్లతో అలరించిన చీరలు.. ప్రస్తుత ఫ్యాషనన్ ప్రపంచానికి తగ్గట్టుగా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. నాడు అగ్గిపెట్టెలో ఇమిడేంత చీర నేసి, నేడు యువతను ఆకట్టుకునే ట్రెండీ డిజైన్లతో మగువల మనసు దోచేవిధంగా పట్టు చీరలను తయారు చేసి పేటెంట్ హక్కులు సాధించుకున్న ఘనత నారాయణపేటకు దక్కింది. ఈ ప్రాంతానికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలు చీరను కొనుగోలు చేసి తీసుకెళ్లడం ఓ ప్రత్యేకత.
‘నారాయణపేటలో చేనేత కేవలం ఓ వృత్తి కాదు.. తరతరాలుగా వస్తున్న జీవన విధానం.
ఒక ఇంట్లో మగ్గం కదిలితేనే ఆ కుటుంబానికి ఉపాధి దొరుకుతుంది. ఒక చీర పూర్తయితే.. నేతన్న కళకు గుర్తింపు లభిస్తుంది. నూలుపోగుతో మొదలై.. మగువ ధరించే వరకు
పేట పట్టు చీర వెనుక ఎందరో కార్మికుల శ్రమ దాగి ఉంది.’
నారాయణపేట పట్టు చీరను కట్టుకున్న
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ (ఫైల్)
ప్రత్యేక డిజైన్లు..
నారాయణపేట పట్టు చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రసిద్ధ డిజైన్లు నీవాళి ధనవతి ప్లెయిన్, నీవాళి ధనవతి కడ్డి, నీవాళి శివశంభు ప్లెయిన్‌న్, నీవాళి శివశంభు కడ్డి, నిపాణి ప్లెయినన్, బార్డర్, టెంపుల్ డిజైన్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ప్రత్యేక ఆర్డర్లపై కూడా చీరలను తయారు చేస్తున్నారు. ఫ్యాషనన్, యువత అభిరుచులకు అనుగుణంగా నేత కార్మికులు కొత్త డిజైన్లను రూపొందిస్తున్నారు. పేట పట్టు చీరలు స్థానిక మార్కెట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి.
సరికొత్త ప్రయోగాలు..
మహిళల అభిరుచులకు అనుగుణంగా నేతన్నలు కొత్త డిజైన్ల రూపకల్పనకు ప్రయోగాలు చేస్తున్నారు. సాంప్రదాయ బార్డర్లకు ఆధునిక టచ్‌లిస్తూ.. తక్కువ బరువు, ఆకర్షణీయమైన రంగులు, కొత్త నమూనాలతో చీరలను తయారు చేస్తున్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయాలు కొనసాగుతున్నాయి.
మాజీ ప్రధానిని మురిపించిన పేట పట్టు..
1983లో నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణపేటకు చెందిన వ్యాపారి విశ్వనాథ్ కళ్యాణి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి పేట పట్టు చీరను బహూకరించినట్లు స్థానిక చేనేత వర్గాలు చెబుతున్నాయి. ఆ చీర ఆమెకు ఎంతగానో నచ్చి అప్పటికప్పుడే ధరించి ఫొటోలు దిగినట్లు చెబుతారు. ఆ చీర నారాయణపేట పేరును దేశవ్యాప్తంగా పరిచయం చేసింది.
తరతరాలుగా కొనసాగుతున్న నేతన్నల నైపుణ్యం
కాలంతో పాటు మారుతున్న డిజైన్లు
నాడు అగ్గిపెట్టెలో ఇమిడేంత చీర తయారీ
పెళ్లిళ్లు, పండుగల్లో ప్రత్యేక స్థానం
నేడు జాతీయ చేనేత దినోత్సవం


