ఇతర రాష్ట్రాలకు.. | - | Sakshi
Sakshi News home page

ఇతర రాష్ట్రాలకు..

Aug 7 2026 1:02 AM | Updated on Aug 7 2026 1:02 AM

పేట పట్టుకు స్థానిక మార్కెట్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్‌ ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, రాయిచూర్‌, కలబుర్గి, యాద్గిర్‌, ముంబై, పుణే, సాంగ్లీ, సోలాపూర్‌, నాగ్‌పూర్‌, అహ్మదాబాద్‌ తదితర నగరాలకు చీరలు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని స్టాక్‌ పాయింట్ల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ పేట పట్టుకు డిమాండ్‌ ఉండటం విశేషం.

● పట్టు చీర వెనుక నేతన్నల శ్రమ ఎంతో ఉంటుంది. బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల నుంచి ముడిసరుకు తెప్పిస్తారు. వాటికి అవసరమైన రంగులద్ది నేత కార్మికులకు అందిస్తారు. తర్వాత మగ్గంపై చీరను నేస్తారు. ఒక్క పట్టు చీర తయారీకి రెండురోజుల సమయం పడుతుంది. నూలుపోగును సరిచేయడం నుంచి డిజైనన్‌ను కుదరించడం వరకు ప్రతి దశలో నేతన్న నైపుణ్యం కనిపిస్తుంది. పెళ్లిళ్లు, పండుగలు, సారెలు, ఇతర శుభకార్యాల్లో పేట పట్టు చీరకు ప్రత్యేక ఆదరణ ఉంది. జిల్లాతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా కొనుగోలుదారులు ఇక్కడికి వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement