7 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుచేశా. ఇటీవల కోత ప్రారంభించి, గెలలను అశ్వారావుపేటలో విక్రయించా. టన్ను రూ.23 వేల వరకు ధర అందుతోంది. ఏడాదిలో 9 నెలలు పంట దిగుబడి వస్తుంది. స్థానికంగానే పరిశ్రమ ఉంటే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు స్థానిక మంత్రి, అధికారులు కృషిచేయాలి.
– సంతోష్‌రెడ్డి, ఆయిల్‌పాం రైతు, మాద్వార్, మక్తల్ మండలం
జిల్లాలో ఆయిల్‌పాం పంట సాగు ప్రస్తుతం 7 వేల ఎకరాలకు చేరువలో ఉంది. మరో 2 నుంచి 3 వేల ఎకరాలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. 10 వేల ఎకరాలు పూర్తిచేస్తే మన జిల్లాలోనే పరిశ్రమ ప్రారంభమవుతుంది. జిల్లాలో కోస్గి, మక్తల్‌లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు, నర్వ, మరికల్ మధ్య ప్రభుత్వ నర్సరీ, ఆయిల్‌పాం పరిశ్రమ ఏర్పాటు కోసం 40 ఎకరాలు భూ కేటాయింపు అయ్యింది.
– సాయిబాబ, జిల్లా ఉద్యాన శాఖాధికారి, నారాయణపేట


