● జిల్లాలో 77.2 శాతం ఉత్తీర్ణత నమోదు
● 46.6 శాతానికేపరిమితమైన బాలురు
● మొదటి సంవత్సరంలో 58 శాతం..
ద్వితీయ సంవత్సరంలో 68 శాతం పాస్
● రీ కౌంటింగ్,
రీ వెరిఫికేషన్ దరఖాస్తునకు
ఈ నెల 20 వరకు అవకాశం
ద్వితీయ సంవత్సరంలో..
రెగ్యులర్ విద్యార్థులు బాలురు 1,312 మందికిగాను 753, బాలికలు 1,927 మందికిగాను 1,511 ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 3,239 మంది విద్యార్థుల్లో 2,264 మంది పాసై 69.9 శాతంతో రాష్ట్రంలో జిల్లా 24వ స్థానంలో నిలిచింది.
● ఒకేషనల్ విభాగంలో బాలురు 128 మందికిగాను 82 మంది, బాలికలు 410 మందికిగాను 383 మంది.. మొత్తం 538 మంది విద్యార్థులకుగాను 465 మంది పాస్ కావడంతో 86.43 ఉత్తీర్ణత శాతం నమోదై రాష్ట్రంలో జిల్లా 2వ స్థానంలో నిలిచింది.
నారాయణపేట రూరల్: ఇంటర్మీడియట్‌బోర్డు ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. జిల్లావ్యాప్తంగా 10 ప్రభుత్వ, 11 కస్తూర్బాగాంధీ, 6 సోషల్ వెల్ఫేర్, 6 బీసీ వెల్ఫేర్, రెండు ఆదర్శ, రెండు మైనార్టీ, ఒక ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలతో పాటు 7 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 8,660 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 5,433 మంది పాస్ కావడంతో 62.73 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక మొదటి సంవత్సరంలో 4,395 విద్యార్థులకుగాను 2,531 మంది పాస్‌కాగా 57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 4,265 మంది విద్యార్థులకుగాను 2,902 మంది ఉత్తీర్ణత సాధించి 68 శాతంలో నిలిచింది. ఇక మొత్తంగా 3,604 మంది బాలురు పరీక్షలు రాయగా.. 1,680 మంది పాస్ కావడంతో 46.6 శాతం, 4856 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 3,753 మంది పాస్ కావడంతో ఏకంగా 77.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా జిల్లాలో బాలికల హవా కొనసాగిందని చెప్పవచ్చు.
మొదటి సంవత్సరంలో..
జిల్లావ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు బాలురు 1,623 మంది పరీక్షలు రాయగా 651 మంది.. బాలికలు 2,070 మందికిగాను 1,537 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 3,893 మంది విద్యార్థులకుగాను 2,188 మంది పాస్ కావడంతో 56.2 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 26వ స్థానంలో జిల్లా నిలిచింది.
● ఒకేషనల్ విభాగంలో బాలురు 198 మందికిగాను 83 మంది, బాలికలు 304 మందికిగాను 260 మంది .. మొత్తం 502 మందికిగాను 343 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 68.33 శాతంతో 7వ స్థానంలో నిలిచింది.
‘రప్రైవేట్’ విద్యార్థులు..
ప్రైవేట్ జనరల్ విభాగంలో బాలురు 328 మంది విద్యార్థులకుగాను 105 మంది, బాలికలు 138 మంది విద్యార్థులకుగాను 57 మంది.. మొత్తం 467 మంది విద్యార్థులకుగాను 462 మంది పాసై 34.48 శాతంతో రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచింది.
ఒకేషనల్ విభాగంలో బాలురు 15 మందికిగాను ఆరుగురు, బాలికల్లో ఆరుగురికిగాను ఐదుగురు మొత్తం 21 మందికిగాను 11 మంది పాసై 52.38 శాతంతో జిల్లా 16వ స్థానంలో నిలిచింది.
ప్రతిభ కనబర్చిన గురుకుల విద్యార్థులు..
మద్దూర్ సాంఘిక సంక్షేమ, మక్తల్ బీసీ సంక్షేమ, నర్వ కేజీబీవీ కళాశాలల్లో వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రభుత్వ, అనుబంధ కళాశాలల్లో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైంది. చాలాచోట్ల ఎంపీసీ, బైపీసీలో 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఉండటంతో వారికి డీఐఈఓ సుదర్శన్‌రావు అభినందనలు తెలిపారు.


