అతి పెద్ద క్రీడా మహోత్సవం సంసద్‌ ఖేల్‌ | - | Sakshi
Sakshi News home page

అతి పెద్ద క్రీడా మహోత్సవం సంసద్‌ ఖేల్‌

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

నర్వ: దేశంలోనే అతిపెద్ద క్రీడా మహోత్సవంగా ప్రధానమంత్రి సంసద్‌ ఖేల్‌ నిలవబోతోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సంసద్‌ ఖేల్‌ క్రీడా మహోత్సవాన్ని ఆమె ప్రారంభించి క్రీడాకారులకు క్రీడా సామగ్రి అందజేసిన అనంతరం క్రికెట్‌ ఆడి అందరిని ఉత్సాహపర్చారు. అంతకుముందు నాగిరెడ్డిపల్లిలో శుద్ధజల కేంద్రం, నర్వలో ఉపాధిహామీ నిధులు రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రహ దారి, లంకాల్‌లో సీసీ రహదారులు, ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను ఆమె ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో గ్రామస్తులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి సీసీ రహదారులు, హైమాస్ట్‌ లైట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామా ల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కొత్తపల్లి, లక్కర్‌దొడ్డి గ్రామస్తులు ఎంపీకి వినతిపత్రం ఇవ్వగా వారితో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా రహదారి లేక ఇబ్బందులు పడుతున్న ఇరు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.7 కోట్లతో టెండర్లు పూర్తిచేసి త్వరగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, కొండయ్య, జిల్లా నాయకురాలు లలిత వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అజిత్‌సింహారెడ్డి, ప్రధానకార్యదర్శి విజయ్‌రామ్‌, నాయకులు కుర్వ సత్యం, నీరజ్‌, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణయ్య, ఆయా గ్రామాల బూత్‌ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement