కన్నడ మీడియంపైనేడు ‘సాక్షి’ చర్చావేదిక
కృష్ణా: జిల్లాలో కన్నడ మీడియం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో కృష్ణా రైతువేదికలో చర్చావేదిక జరగనుంది. గడినాడ కన్నడ సంఘం నాయకులతో పాటు విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు చర్చావేదికలో పాల్గొననున్నారు. మండలంలో కన్నడ మీడియం చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించి ‘సాక్షి’ ఓ మంచి వేదికను ఏర్పాటు చేయడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
నేడు డయల్
యువర్ డీఎం
నారాయణపేట రూరల్: జిల్లాలోని కోస్గి, నారాయణపేట ఆర్టీసీ డిపోల పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు గాను గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్థానిక ఆర్టీసీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 73828 26293 నంబర్‌ను సంప్రదించి.. సమస్యలను తెలియజేయడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని వారు కోరారు.
వేరుశనగ క్వింటా రూ.8,262
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా రూ. 8,262, కనిష్టంగా రూ. 6,509 ధర పలికింది. ఉలవలు రూ. 3,191, అలసందలు రూ. 5వేలు, వడ్లు (సోన) రూ. 2,240, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,036, కనిష్టంగా రూ. 4,050, తెల్లకందులు గరిష్టంగా రూ. 7,856, కనిష్టంగా రూ. 4,111 ధరలు పలికాయి.
మున్సిపల్
కమిషనర్ల బదిలీ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో గ్రేడ్–1 కమిషనర్‌గా పనిచేస్తున్న టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీకి.. అక్కడి నుంచి పి.రామానుజులరెడ్డి పాలమూరుకు వస్తున్నారు. భూత్పూర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న నూరుల్‌నజీబ్ వనపర్తి జిల్లాలోని అమరచింతకు వెళ్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌లో కమిషనర్‌గా పనిచేస్తున్న పి.చంద్రశేఖర్‌రావు భూత్పూర్‌కు వస్తున్నారు. నందికొండలో పనిచేస్తున్న సీహెచ్ వేణును నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటకు పంపిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న డి.మురళిని నందికొండకు బదిలీ చేశారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు నుంచి బి.యాదగిరి నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌కు వస్తున్నారు.
వైభవంగా ధ్వజారోహణం
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం ధ్వజారోహణం వైభవంగా ని ర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య ధ్వజస్తంభం వద్ద పతాకావిష్కరణ చేశారు. అనంతరం ప్రాణప్రతిష్ఠ చేసి బలిహరణం జరిపించారు. గురువారం రెండు మనోహరమైన సేవలు జరిపించనున్నారు.
భక్తిశ్రద్ధలతో వార్షిక బ్రహ్మోత్సవాలు
అలంపూర్: శ్రీజోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం మూడో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా అమ్మ వారి ఆలయంలో కుంకుమార్చన పూజలు, త్రిశతి అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించారు. అదేవిధంగా విశేష అర్చనలు, చండీ హోమా లు, పవమాన సూక్త పారాయణ, పవమాన సూక్త హోమాలు, అవాహిత దేవతా హోమా లు, మండప ఆరాధన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు తదితర పూజలు చేశారు. మరో రెండు రోజుల పాటు వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతాయని ఆలయ ఈఓ దీప్తి తెలిపా రు. ఈ నెల 23వ తేదీ ఉత్సవాల చివరి రోజు బ్రహోత్సవాల్లో భక్తులకు అమ్మవారు నిజరూప దర్శనం కలుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు.


