కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి
నర్వ: మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టే కంది కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు. సోమవారం నర్వ మహిళా సమాఖ్య భవనం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ప్రారంభం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.8 వేలు అందజేస్తుందని, రైతులు ధాన్యాన్ని 12 శాతంలోపు తేమ ఉండేలా తీసుకురావాలన్నారు. తక్కువ ధరకు దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతోనే లబ్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనువాసులు, ఏపీఎం చంద్రశేఖర్, మహిళా సమాఖ్య కోశాధికారి సంతోష, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, నర్వ సర్పంచు హన్మంతురెడ్డి, ఉప సర్పంచు అజయ్ తదితరులు పాల్గొన్నారు.


