చాలా సంతోషంగా ఉంది
ప్రాజెక్టులో మూడు ఎకరాల భూమి కోల్పోయాను. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమి ఇవ్వడంతో ఎకరాకు రూ.14 లక్షలు మొదట ఇచ్చారు. ఇప్పుడు పెరిగిన రూ.6 లక్షల చెక్కును ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉంది. – నామ్యానాయక్,
భూనిర్వాసితుడు, దామరగిద్ద
మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులో రైతులకు రూ.20 లక్షలు ఎకరానికి భూ పరిహారం ఇచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మాటా ఇచ్చారు. ఈ రోజు నిలబెట్టుకున్నారు. కలెక్టర్, ఎస్పీ ఎంతో సహకరించారు. ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయం, అఖిల పక్షం పార్టీల సహాకారంతో రైతులకు ఎకరాకు రూ.20 లక్షల భూ పరిహారం తీసుకోగలిగాం. అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– కుంభం శివకుమార్‌రెడ్డి,
డీసీసీ మాజీ అధ్యక్షుడు
చాలా సంతోషంగా ఉంది


