
సాగులో మెళకువలుచెప్పేవారు..
సురవరం పొలాలను మేమే సాగు చేస్తాం. గ్రామానికి వచ్చినప్పు డు పంటలను తప్పక పరిశీలించేవారు. దిగుబడి, చీడపీడల గురించి అడిగి తెలుసుకొని కొత్త పంటల గురించి వివరించేవారు. అందరికి సహకరిస్తూ సాయంగా ఉండేవారు. – చిన్న కర్రెన్న, కంచుపాడు
అన్యోన్యంగా ఉండేవారు..
సురవరం సుధాకర్‌రెడ్డి గ్రామానికి వచ్చిన సమయాల్లో రాజకీయాల గురించి అడిగి తెలుసుకునే అలవాటు. అలాగే ప్రతి సంక్రాంతికి యువతను ప్రోత్సహించడానికి క్రీడాపోటీలు నిర్వహించేవారు. తనతోపాటు కూర్చున్న యువకులకు క్రీడలు, జీవితంలో రాణించడం తదితర అనేక అంశాలపై అవగాహన కల్పించేవారు. అందరితో ఎంతో అనోన్యంగా ఉండేవారు.
– వీరేష్, మండల అధ్యక్షుడు, ఏఐవైఎఫ్

సాగులో మెళకువలుచెప్పేవారు..