
రోడ్డు విస్తరణ పనుల అడ్డగింత
మద్దూరు: మద్దూరులో పట్టణంలోని సినిమా థియేటర్ నుంచి కొత్తబస్టాండ్ వరకు చేపట్టే రోడ్డు విస్తరణను బాధితులు శనివారం అడ్డుకున్నారు. రెండేళ్ల క్రితం పట్టణాభివృద్దిలో భాగంగా ప్రధాన రోడ్డును ఇరువైపులా 35 ఫీట్ల మేరకు విస్తరణకు దుకాణాల యజమానులు స్వచ్ఛందగా అనుమతి ఇచ్చి గ్రామ పంచాయతీ తీర్మాణం అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈలోపు మిషన్ భగీరథ పైప్‌లైన్ కోసం ఇరువైపుల మరో 3 ఫీట్లు కావాలని ఆర్‌అండ్‌బీ అధికారులు మార్కింగ్ వేశారు. ఈ రోజు పనులు ప్రారంభించడానికి వస్తే బాధితులందరు పనులను అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. రెండేళ్లు గడుస్తున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్న పట్టించుకోవడం లేదు కానీ, మళ్లీ 3 ఫీట్ల విస్తరణ వచ్చారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోను ఇచ్చేది లేదంటూ పనులను అడ్డుకున్నారు. ఇదే విషయాన్ని ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ రాములును వివరణ కోరగా గతంలో తీర్మాణం చేసిన 35 ఫీట్ల వరకు విస్తరణ పనులు చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఏఈ బాలరాజ్, రోడ్డు విస్తరణ బాధితులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
నారాయణపేట టౌన్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ పార్కు ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం ఫీజు దీక్షను నిర్వహించారు. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ మెంబర్ నరహరి మాట్లాడుతూ... విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనం అన్నారు. పెండిగ్ బకాయిలు విడుదల చేసే వరకు తమ ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆదుకోవాలన్నారు.

రోడ్డు విస్తరణ పనుల అడ్డగింత