7 బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన
రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్లో సర్వే నెంబర్లు మిస్ అయ్యాయని, భూ విస్తీర్ణం తక్కువగా వచ్చిందని, మ్యూటేషన్ అమలు కాలేదన్న, తదితర సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్‌ఐ, ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్, వీఆర్‌ఏలతో కూడిన 7 బృందాలను అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఏర్పాటు చేశారు. గ్రామాలకు వెళ్లి దరఖాస్తుదారులు, ఇతర అభ్యంతరాలు వచ్యిన వారికి పిలిపించి క్షేత్ర స్థాయి పరిశీలన ప్రారంభించారు. 421 దరఖాస్తుల పరిశీలన కోసం ఈ బృందాలు గ్రామాల్లో ప్రతి రోజూ సమగ్రమైన విచారణ చేపట్టి సమస్య పరిష్కారానికి నివేదికలు అధికారులకు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 43 దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన ముగిసింది. ఇందులో కూడా 197 దరఖాస్తులు క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికారులు అమోదించగా అందులో 220 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల చివరికి వరకు రెవెన్యూ సదస్సులు ద్వార వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు అన్ని కసరత్తులు చేస్తున్నారు. ప్రతి నిత్యం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్‌డీఓ స్థాయిలో మానిటరింట్ జరుగుతుంది.


