అడిషనల్ కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్
నారాయణపేట: జిల్లా లోకల్‌బాడీ అడిషనల్ కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అడిషనల్ కలెక్టర్‌గా నియమించిన నారాయణ్ అమిత్ మలేంపాటి నియామకాన్ని రద్దు చేశారు. వికరాబాద్ జిల్లా తాండూర్‌లో సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉమాశంకర్ ప్రసాద్‌ను జిల్లా లోకల్‌బాడీ అడిషనల్ కలెక్టర్ (ఎఫ్‌ఏసీ)గా నియమించారు.
హంసధాన్యం @ రూ.2,366
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం హంసధాన్యం క్వింటా గరిష్టంగా రూ. 2,366, కనిష్టంగా రూ. 2,005 ధర పలికింది. సోనధాన్యం గరిష్టంగా రూ. 2,735, కనిష్టంగా రూ. 1,801, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,695, కనిష్టంగా రూ.5,411, తెల్లకందులు గరిష్టంగా రూ. 7,759, కనిష్టంగా రూ. 6,300 ధరలు వచ్చాయి.
అడిషనల్ కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్


