కమలాపురం సర్పంచ్‌ ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

కమలాపురం సర్పంచ్‌ ఏకగ్రీవం

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

డోన్‌ రూరల్‌: కమలాపు రం సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో దిగిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు బుగ్గన జయలక్ష్మి ఏకగీవ్రంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. ఈ పంచాయతీలో ఆమె ఒక్కరే సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేయడంతో త్వరలో అధికారుల ప్రకటించనున్నారు. టీడీపీకి చెందిన డోన్‌ జెడ్పీటీసీ సభ్యులు వేదవతి స్వగ్రామమైన కమలాపురం నుంచి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఏకగ్రీవంగా సర్పంచ్‌ పదవికి ఎన్నికై న వైఎస్సార్‌సీపీ మద్దతుదారురాలిగా బుగ్గన జయలక్ష్మి నిలిచిపోయారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సమీప బంధువు అయిన బుగ్గన జయచంద్రారెడ్డి సతీమణి జయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక అవుతుండటం మాజీ ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు బొబ్బల శివరామిరెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలనుకోవడం తగదు

నంద్యాల(అర్బన్‌): అప్రజాస్వామిక పద్ధతిలో పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలవాలనుకోవడం కూటమి ప్రభుత్వానికి తగదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాపకృద్దీన్‌, పట్టణ కార్యదర్శి ప్రసాద్‌, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్నలు అన్నారు. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌, వార్డు సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని పెద్దకొట్టాల, రాయమాల్పురం, బిల్లలాపురం గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రశాంతమైన వాతావరణం, సమగ్రాభివృద్ధి, పేదలకు న్యాయం, యువతకు ఉపాధి కలగాలంటే మండల గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

రమేష్‌బాబు కుటుంబానికి అండగా నిలుస్తాం

బొమ్మలసత్రం: అనారోగ్యంతో మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ రమేష్‌బాబు కుటుంబానికి పోలీస్‌ శాఖ అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ సునీల్‌షోరాణ్‌ తెలిపారు. పట్టణంలోని టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ రమేష్‌బాబు అనారోగ్య కారణాలతో మంగళవారం ఉదయానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రైతునగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ తరఫున ఏ విధమైన సహాయం అవసరమైనా తనను, సంబంధిత అధికారులను సంప్రదించాలని కుటుంబీకులకు తెలిపారు.

రబీ సాగులో

పురోగతి కరువు

కర్నూలు(అగ్రికల్చర్‌): రబీ సాగులో పురోగతి కరువైంది. సీజను మొదలై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా సాగు 50 శాతం కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రబీ సాధారణ సాగు 1,07,475 హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 42,430 హెక్టార్లకే సాగు పరిమితమైంది. జిల్లాలో శనగ ప్రధాన పంట. శనగ సాధారణ సాగు 57,323 హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 28,459 హెక్టార్లలో సాగయింది. నవంబర్‌ తర్వాత శనగ సాగు చేసే అవకాశం తక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. వరి కేవలం 5 హెక్టార్లకే పరిమితమైంది. జొన్న 6,882, మొక్కజొన్న 1,331, వేరుశనగ 1,907, పొగాకు 2,822, మినుము 143 హెక్టార్లలో సాగు చేశారు. అయితే వర్షాలు లేకపోవడంతో భూమిలో తేమ లేక సాగు చేసిన పంటలు కూడా దెబ్బతింటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement