ప్రజలకు దూరం చేయలేరు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు దూరం చేయలేరు

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

● ఓటమి భయంతోనే చల్లా శ్రీదేవి నామినేషన్‌ తిరస్కరణ ● నీచ రాజకీయాలతో పోటీ నుంచి తప్పుకున్న 16 మంది వార్డు సభ్యులు ● వైఎస్సార్‌సీపీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చల్లా విఘ్నేశ్వరరెడ్డి

● ఓటమి భయంతోనే చల్లా శ్రీదేవి నామినేషన్‌ తిరస్కరణ ● నీచ రాజకీయాలతో పోటీ నుంచి తప్పుకున్న 16 మంది వార్డు సభ్యులు ● వైఎస్సార్‌సీపీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చల్లా విఘ్నేశ్వరరెడ్డి

కొలిమిగుండ్ల (అవుకు): కుట్రలు, కుతంత్రాలతో టీడీపీ నాయకులు తమను పదవులు దక్కకుండా చేయగలరే తప్ప ప్రజలకు దూరం చేయలేరని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చల్లా విఘ్నేశ్వరరెడ్డి అన్నారు. అవుకు మేజర్‌ పంచాయతీకి దివంగత చల్లా రామకృష్ణారెడ్డి సతీమణి చల్లా శ్రీదేవిని ప్రత్యేక పరిస్థితుల్లో బరిలో నిలవడంతో కూటమి నేతలు ఓటమి భయంతో కుట్ర పూరితంగా నామినేషన్‌ తిరస్కరించారని విమర్శించారు. మంగళవారం పట్టణంలోని చల్లా ప్రజాభవన్‌లో మాజీ ఎంపీపీ చల్లా రాజశేఖరరెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ చల్లా రఘునాథరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తన తల్లి చల్లా శ్రీదేవి నామినేషన్‌ తిరస్కరణతో 16 మంది వార్డు సభ్యులు కూడా పోటీ నుంచి వైదొ లుగుతున్నట్లు ప్రకటించారన్నారు. బెదిరింపులు, ఒత్తిళ్లు వచ్చినా తమపై అభిమానంతోనే వార్డు సభ్యులు పోటీ చేసేందుకు ముందుకొచ్చారన్నారు. రాబోయే రోజుల్లో వారికి మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వయసు సహకరించక పోయినా అమ్మ శ్రీదేవికి అన్ని వర్గాల ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడుగా నిలుస్తామని చెప్పారన్నారు. చల్లా రామకృష్ణారెడ్డి 45 ఏళ్ల పాటు అవుకు అభివృద్ధికి ఎంతోగానో కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తీరు ఎలా జరుగుతుందో అందరూ గమనిస్తున్నారని చెప్పారు. అవుకును రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసుకుంటామన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రెండేళ్లు ఆగితే మంచి రోజులు వస్తాయని, ఎవరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. చల్లా శ్రీదేవి సర్పంచ్‌గా బరిలో ఉన్నారని తెలియగానే ఊహించని రీతిలో స్పందన వచ్చిందన్నారు. వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని భావించిన టీడీపీ నేతలు కుట్రకు తెరలేపి ఆమె నామినేషన్‌ను తిరస్కరింపజేశారనేది ప్రజలందరికీ తెలుసునన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement