15 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

15 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

బండిఆత్మకూరు: భోజనం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు మంగళవారం శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మండల అధ్యక్షులు బారెడ్డి విజయ భాస్కర్‌ రెడ్డి అధ్వర్యంలో గ్రామానికి చెందిన నందకుమార్‌ యాదవ్‌, చాకలి కృష్ణ కుటుంబాలతో పాటూ మరో 13 కుటుంబాలు నంద్యాలలో శిల్పా సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శిల్పా వారికి కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి, సర్పంచ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థిని గెలిపించాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలన్నారు. సీఎం చంద్రబాబు హామీలను అమ లు చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డదారిలో ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నా రన్నారు. కార్యక్రమంలో నాయకులు గురివిరెడ్డి, ఫణీంద్రా రెడ్డి, బద్రి, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement