కర్నూలు: ఏపీఎస్పీ కర్నూలు రెండో బె టాలియన్‌లో దోబీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న చాకలి భారతి ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు మైనర్లను నాల్గవ పట్ట ణ పోలీసులు అదుపులోకి తీసుకుని చో రీ సొత్తును రికవరీ చేశారు. ఈ నెల 16 వ తేదీన ఆమె ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి నాలుగు తు లాల బంగారు ఆభరణాలు,రూ.45 వేల నగదు, సెల్‌ఫోన్‌ను చోరీ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాలుగో పట్టణ పోలీసులు ఈ నెల 22వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మాధవనగర్‌కు చె ందిన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసు కుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తుతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జువైనల్ హోమ్‌కు తరలించినట్లు సీఐ విక్రమసింహా తెలిపారు


