డోన్ టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నాటు సారా తయారీ, సరఫరాపై విస్తృత దాడులు, తనిఖీలు చేపట్టినట్లు నంద్యాల జిల్లా ప్రోహిబిషన్ ఎకై ్సజ్‌శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయ్‌కుమార్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. మండలంలోని చనుగొండ్ల, కొత్తపేట, ఉడుములపాడు గ్రామాల్లోని బెల్టు షాపులపై దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా స్క్వాడ్ సీఐ లక్ష్మణదాసు, డోన్ ఎకై ్సజ్ సీఐ జప్రూల్లా, ఎస్ఐలు సోమశేఖర్‌రావు, దౌలత్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


