గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

కర్నూలు: కర్నూలు–దూపాడు రైల్వే స్టేషన్ల మధ్య వెంగన్న బావి సమీపంలోని నవత ట్రాన్స్‌పోర్టు వెనుక రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఛత్రపతి శంబాజీనగర్‌ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి మరణించాడు. ఇతని వయ స్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. తెలుపు రంగు చొక్కాపై ఎరుపు, నలుపు రంగుల నిలువు అడ్డగీతలు ఉన్నాయి. ముదురు నీలం రంగు ఫుల్‌డ్రాయ ర్‌, దానిపై ఆంగ్లంలో లయన్‌ అనే అక్షరాలు ఉన్నాయి. గోధుమ రంగు పంచ ధరించాడు. సుమారు 5.6 అడుగుల ఎత్తు, ఛామన ఛాయ వర్ణం ఉంటాడు. కుడివైపు ఛాతిపై త్రిశూలం పచ్చబొట్టు ఉంది. అలాగే కుడి చేతిపై ఆంజనేయస్వామి, శివలింగం గుర్తు పచ్చబొట్టు ఉంది. మృతుడి వివరాలు తెలిసినవారు కర్నూలు జీఆర్‌పీ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి సెల్‌ నంబర్‌ 92475 75608 లేదా ఎస్‌ఐ 92475 75610 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించా లని హెడ్‌ కానిస్టేబుల్‌ మాధవస్వామి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement