చిప్పగిరి: సరైన అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తున్న మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు మైన్స్, విజిలెన్స్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారు మాట్లాడుతూ.. సరైన అనుమతి పత్రాలు లేకుండా వెళుతున్న మూడు గ్రావెల్ వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం ప్రభు త్వ పనులకై నా, ప్రైవేట్ పనులకై నా గ్రావెల్ తరలించేందుకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.


