నంది విగ్రహం అపహరణ | - | Sakshi
Sakshi News home page

నంది విగ్రహం అపహరణ

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

సి.బెళగల్‌: సి.బెళగల్‌ మండలం పోలకల్‌ గ్రామ శివాలయంలో నంది విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. పోలకల్‌ నుంచి మునగాల గ్రామానికి వెళ్లే దారిలో పురాతన శివాలయం ఉంది. ఆలయం గ్రామ శివారులో, పొలాల్లో ఉండటంతో దొంగలు ఆలయంలోని పురాతన నంది విగ్రహాన్ని పెకలించి తీసుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం విషయం బయకు పొక్కడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించి నంది విగ్రహాన్ని తిరిగి తీసుకురావాలని భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement