కూరగాయలా.. అమ్మో వద్దులే! | - | Sakshi
Sakshi News home page

కూరగాయలా.. అమ్మో వద్దులే!

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

● ధరలు వింటే పేదల బెంబేలు ● ప్రభుత్వ ప్రోత్సాహం లేక పూర్తిగా పడిపోయిన సాగు ● నవంబరులోనే కొరత.. ఇక వేసవి పరిస్థితేంటో! ● ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో వినియోగదారుల కుదేలు

2025 నవంబరుతో పోలిస్తే.. రిటైల్‌ మార్కెట్‌లో ప్రస్తుతం కూరగాయల ధరలు

● ధరలు వింటే పేదల బెంబేలు ● ప్రభుత్వ ప్రోత్సాహం లేక పూర్తిగా పడిపోయిన సాగు ● నవంబరులోనే కొరత.. ఇక వేసవి పరిస్థితేంటో! ● ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో వినియోగదారుల కుదేలు

కర్నూలు(అగ్రికల్చర్‌): నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పులు, చక్కెర, వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కారు చేతులెత్తేసింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. ఈ స్థితిలో కూరగాయల ధరలు సైతం వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఫిబ్రవరి నెలలోనే భారత వాతావరణ సంస్థ సర్కారును హెచ్చరించినప్పటికి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదు. దీంతో నిత్యావసర వస్తువులు, మరోవైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కనిపించని హైవాల్యూ కూరగాయల

పంటలు

2019–20 నుంచి 2023–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించింది. దీంతో జిల్లాలో రక్షిత సాగు కింద హైవాల్యూ కూరగాయల సాగు సాకారం అయ్యింది. యూరోపియన్‌ కుకుంబర్‌, క్యాప్సికం, పర్పిల్‌ కలర్‌ క్యాబేజీ, బ్రకోలీ, క్యారెట్‌, క్యాలీప్లవర్‌ తదితర హైవాల్యూ కూరగాయలను పండించి తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో హైవాల్యు కూరగాయల సాగు కనిపించడం లేదు. అలాగే వంకాయ, బెండకాయ, చౌళకాయలు, క్యాబేజీ, బీర వంటి కూరగాయలకు సైతం కొరత ఏర్పడటం గమనార్హం.

1944 హెక్టార్లలోనే కూరగాయల సాగు

ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో రైతులకు కూరగాయల సాగుపై ఆసక్తి తగ్గిపోయింది. రబీలో కూరగాయల సాధారణ సాగు 8862 హెక్టార్లు కాగా దాదాపు రెండు నెలల్లో కేవలం 1944 హెక్టార్లకే సాగు పరిమితమైంది. ఈ స్థాయిలో కూరగాయల సాగు పతనం కావడం ఇదే మొదటిసారి. ఉల్లి 1210 హెక్టార్లలో సాగైంది. ఉల్లి, పూలు, వాము మినహాయిస్తే కూరగాయల సాగు కేవలం 402 హెక్టార్లే. జిల్లాల్లో ప్రధాన పంటగా ఉన్న టమాట సాగు కేవలం 145 హెక్టార్లే.

షాక్‌ కొడుతున్న ధరలు

గతేడాది నవంబరుతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టమాట రూ.30 నుంచి రూ.40 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. నేడు రిటైల్‌ మార్కెట్‌లో ఏది తీసుకున్నా ధర రూ.60 నుంచి ఉంటోంది. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు వినియోగదారులకు భారంగా మారాయి. ఇప్పుడు కూరగాయల ధరలు సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే వేసవి పరిస్థితి ఏంటనే ఆందోళన కలుగుతోంది.

ప్రభుత్వ ప్రోత్సాహం సున్నా...

కూరగాయలు 2025 ప్రస్తుత నవంబరులో ధర (రూ.)

(ధర రూ.)

టమాట 10 30

వంకాయ 30/34 70/80

బెండ 14 55

కాకర 36 60

బీర 34 60

క్యాలిప్లవర్‌ 30 40

చెవులకాయ 24 50

చిక్కడు 36 55

ఉల్లిగడ్డలు 10/15 50

దోసకాయ 24 45

దొండకాయ 24 40

బీన్స్‌ 56 90

ఎల్‌నినో వంటి పరిస్థితులు ఏర్పడినపుడు ప్రభుత్వం ముందు చూపుతో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ కొరత ఏర్పడకుండా చూడాలి. కానీ చంద్రబాబు సర్కారు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు ఉన్నా ఆచరణలో అమలు కావడం లేదు. అలాగే సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేసిన దాఖలాలే లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement