వెండి కాసుల హారాలు విరాళం | - | Sakshi
Sakshi News home page

వెండి కాసుల హారాలు విరాళం

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

విద్యుదాఘాతంతో యువకుడు.. 26న రెజ్లింగ్‌ ఎంపిక పోటీలు

మద్దికెర: మండల పరిధిలోని పెరవలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి దేవాలయంలో స్వామి వారికి, శ్రీరాజ్యలక్ష్మి, భూదేవి అమ్మవార్లకు అనంతపురం పట్టణానికి చెందిన కాకర్ల అనసూయమ్మ, రాఘవయ్య దంపతులు అర కిలో వెండి లక్ష్మి కాసుల హారాలను విరాళంగా ఈఓ వీరయ్యకు మంగళవారం అందజేశారు. అర్చకులు రంగస్వామి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను దాతలకు అందజేశారు. చైర్మన్‌ రవికుమార్‌, అర్చకులు మధుస్వామి పాల్గొన్నారు.

వాటర్‌ హీటర్‌ తగిలి యువకుడి దుర్మరణం

కోవెలకుంట్ల: పట్టణంలోని ఎల్‌ఎం కాంపౌండ్‌కు చెందిన ఓ యువకుడు మంగళవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. కాలనీలో నివాసం ఉంటున్న ఏసోబు, సునీత దంపతుల కుమారుడు కోగిల మునెయ్య (29) సాన్నం చేసేందుకు బాత్‌రూంలోకి వెళ్లి వేడి నీళ్లకోసం బకెట్‌లో హీటర్‌ ఉంచి కరెంట్‌ ఆన్‌ చేశాడు. కొద్దిసేపటి తర్వాత బకెట్‌లో చెయి పెట్టడంతో విద్యుత్‌ షాక్‌కు గురై గట్టిగా అరిచి కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు విద్యుత్‌ షాక్‌ వల్ల అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. మృతుడికి ఏడాది క్రితం ఇదే మండలంలోని రేవనూరుకు చెందిన దీప్తి అనే యువతితో వివాహం జరిగింది.

కొలిమిగుండ్ల/అవుకు: అవుకు మండల పరిధిలోని మంగంపేటకు చెందిన చింత లోకేశ్‌ (34) మంగళవారం తెల్లవారుజామున విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున మంగంపేట తండాకు సమీపంలో ఉన్న శివాలయం వద్దకు బైక్‌లో వెళ్లి వాటర్‌ ఫాల్స్‌ వద్ద బైక్‌ నిలిపి నడిచి వెళుతున్నాడు. అక్కడి కంది చేనుకు రైతు కరెంట్‌ ఏర్పాటు చేశాడు. నడిచి వెళుతున్న లోకేశ్‌ తీగకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. తర్వాత మృతదేహాన్ని సమీపంలోని కొండలోకి తీసుకెళ్లి పడేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

నంద్యాల(న్యూటౌన్‌): ఈనెల 26వ తేదీన ఆళ్లగడ్డ పట్టణంలోని రాయలసీమ రెజ్లింగ్‌ అకాడమీలో సీనియర్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ రెజ్లింగ్‌ (కుస్తీ) ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా అసోసియేషన్‌ చైర్మన్‌ సుబ్బారెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు రాబర్ట్‌, సుభద్రమ్మ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ కుస్తీ సీనియర్‌ ఎంపిక పోటీలకు 20 సంవత్సరాలు దాటిన వారు అర్హులన్నారు. 18, 19 సంవత్సరాల వారు మెడికల్‌ సర్టిఫికెట్‌తో ఎంపికలో పాల్గొనవచ్చన్నారు. గతంలో రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొన్న వారు మాత్రమే ఈ ఎంపికలో పాల్గొనాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు డిసెంబర్‌ 5, 6 తేదీల్లో చిత్తూరు జిల్లా డీఎస్‌ఏ స్టేడియంలో జరిగే సీనియర్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ 99668 69159 నంబర్‌ను సంప్రదించాలని కోచ్‌ సుబ్బరాయుడు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement