బస్సు ఢీకొని వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి | - | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

బండిఆత్మకూరు: మండలంలోని సంతజూటూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కై ప శివకృష్ణ (33)ను మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు నుంచి నంద్యాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు ప్ర యాణికులతో కిక్కిరిసి ఉండటంతో లింగాపురం రహ దారి వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రయాణికులు వేచి ఉన్నప్పటికీ ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ క్రమంలో పొలం వద్ద నుంచి బైక్‌పై వస్తున్న శివకృష్ణ రోడ్డు మీదకు చేరుకోగానే బస్సు వేగంగా ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య రాధిక, ఇద్దరు సంతానం ఉన్నారు. భార్య రాఽధిక ప్రస్తుత సర్పంచ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో గ్రామంలోని మూడవ వార్డు అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్‌ తెలిపారు. పొలానికి వెళ్లిన యువకుడి ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.

29న ఆర్చరీ ఎంపిక పోటీలు

కర్నూలు (టౌన్‌): కర్నూలులోని స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియంలో ఈ నెల 29న ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి నాగరత్నమయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు.అండర్‌–10, అండర్‌–13, అండర్‌–15 బాలబాలికలకు రికర్వ్‌, కాంపౌండ్‌, ఇండియన్‌ రౌండ్‌ విభాగాల్లో పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్‌ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, 2 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీ ల్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 93938 55460 సెల్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement