బియ్యం అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

బియ్యం అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

కర్నూలు (సెంట్రల్‌): బియ్యం అక్రమంగా నిల్వ ఉంచి అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల అధికారి ఎం.రాజా రఘువీర్‌ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల మేరకే బియ్యం విక్రయాలు జరపాలన్నారు. ఆయన మంగళవారం నగరంలోని బళ్లారి చౌరస్తాలోని డి–మార్ట్‌, నందికొట్కూరు రోడ్డులో ఉన్న డి–మార్ట్‌, గాయత్రి ఎస్టేట్‌లోని రిలయన్స్‌ మార్ట్‌, శకుంతల కళ్యాణ మండపం సమీపంలోని స్మార్ట్‌ బజార్‌, విశాల్‌ మార్ట్‌, మోర్‌ సూపర్‌ మార్కెట్‌, జ్యోతి మాల్‌తో పాటు మరో 10 హోల్‌సేల్‌ అండ్‌ రిటైల్‌ బియ్యం విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ పథకాల బియ్యం కిలో రూ.76 ప్రకారం, జైశ్రీరాం, నంద్యాల సోన రకాలు కిలో రూ.82 ప్రకారం అమ్మాలన్నారు. ప్రతి షాపులో బియ్యం ధరలను పెద్ద బోర్డుల్లో రాసి డిస్‌ప్లే చేయాలన్నారు. అక్రమంగా బియ్యం నిల్వలు ఉంచితే షాపులను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. నగర సహాయ పౌర సరఫరాల అధికారి వెంకటరాజు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల బృందం వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement