గోనెగండ్ల: కుక్కను తప్పించబోయి బైక్‌పై నుంచి కిందపడిన ఘటనలో మండలంలోని చిన్నమరివీడు గ్రామానికి చెందిన బోయ వెంకటేష్ (35) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల మేరకు.. చిన్నమరివీడు గ్రామానికి చెందిన బోయ వెంకటేష్‌కు మూడు ఎకరాల పొలం ఉంది. అందులో వేరుశనగ పంట సాగుచేశాడు. సోమవారం ఉదయం ఆ పంటకు నీళ్లు పెట్టేందుకు బైకుపై వెళ్లి తిరిగి వస్తుండగా పెద్దనేలటూర్ రోడ్డులో కల్వర్టు దగ్గర కుక్క అడ్డం వచ్చింది. దానిని తప్పించే క్రమంలో బైక్ అదపుతప్పడంతో కింద పడ్డాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయం కావడంతో వెంకటేష్‌ను ఆటోలో ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వెంకటేష్‌కు కుమారుడు, కుమార్తె సంతానం.


