భగీరథ ప్రయత్నం | - | Sakshi
Sakshi News home page

భగీరథ ప్రయత్నం

Nov 24 2026 1:42 AM | Updated on Nov 24 2026 1:42 AM

కేసీ కెనాల్‌ వెంట మోటార్లు వేసుకున్న రైతులు

కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతులను సాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. ప్రస్తుతం ఆరుతడుల కోసం కేసీకి 700 క్యూసెక్కుల సాగునీటిని వదిలారు. దీంతో 22వ లాక్‌ వెంకటేశ్వరం వద్ద నుంచి 24వ లాక్‌ దొర్నిపాడు వరకు కేవలం అడుగులోతు కూడా నీరు రాకపోవడంతో రైతులు తమ జొన్న పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు జొన్న పంటను 2,880 హెక్టార్లలో సాగు చేశారు. కేసీ కెనాల్‌ వెంట రైతులు ట్రాక్టర్ల సాయంతో రూ. వేలు ఖర్చు చేస్తూ జొన్న పంటను కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. 25వ లాక్‌ వరకు సాగునీరు చేరక పోవడంతో రామచంద్రాపురం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు తడులకు నీరు ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయకుండా ప్రభుత్వం రైతులతో చెలగాటం ఆడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

– దొర్నిపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement