మంత్రి సతీమణి కోసమే రిజర్వేషన్‌ మార్పు | - | Sakshi
Sakshi News home page

మంత్రి సతీమణి కోసమే రిజర్వేషన్‌ మార్పు

Nov 21 2026 2:56 AM | Updated on Nov 21 2026 2:56 AM

● బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

బనగానపల్లె: మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి తన సతీమణి ఇందిరమ్మ కోసమే బనగానపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ రిజర్వేషన్‌ను బీసీలకు రాకుండా ఓసీగా మార్పు చేశారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. నామినేషన్‌ చివరి రోజు శుక్రవారం వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడగా, సర్పంచ్‌ అభ్యర్థిగా అబ్దుల్‌ఫైజ్‌ తన రెండో సెట్‌ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో దాఖలు చేశారు. ఈ సందర్బంగా నామినేషన్‌ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడారు. రిజర్వేషన్‌ ప్రక్రియలో భాగంగా బనగానపల్లె మండలం అప్పలాపురం గ్రామ పంచాయతీ ఓసీలకు కేటాయించాల్సి ఉందన్నారు. మంత్రి తన అధికారంతో ఈ రిజర్వేషన్‌ను బీసీలకు, బనగానపల్లె సర్పంచ్‌ స్థానాన్ని ఓసీగా మార్పు చేయించినట్లు తెలిపారు. ఈ మార్పుపై తాము హైకోర్టును ఆశ్రయించగా సంబంధిత అధికారులు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించడంతో కేసు కోట్టి వేశారన్నార. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలు ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే అన్నారు. రెండున్నర సంవత్సరాలుగా చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పథకం అమలు చేయలేదన్నారు.

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడిని

గెలిపించాలి

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బనగానపల్లెలో వందపడకల ఆసుపత్రి నిర్మించామని కాటసాని తెలిపారు. పట్టణ ప్రజలకు సీసీ రోడ్లు, డ్రైయినేజీలు, సెంటర్‌లైటింగ్‌ సిస్టం అందుబాటులోకి తెచియచంది తానేనని చెప్పారు. డబుల్‌రోడ్లు మాత్రమే కాకుండా మరెన్నో అభివృద్ధి పనులు తాను చేసినట్లు వివరించారుస. నిబంధనల ప్రకారం బనగానపల్లె సర్పంచ్‌ స్థానం బీసీలకు కేటాయించాల్సి ఉన్నందున వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడిగా బీసీ అభ్యర్థి అయిన అబ్దుల్‌ ఫైజ్‌ను నామినేషన్‌ దాఖలు చేశారన్నారు. పట్టణ ప్రజలు అయనను, వార్డు సభ్యులుగా నామినేషన్‌వేసిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను మంచి మెజార్టీతో గెలిపించి పట్టణ అభివృద్దికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన అబ్దుల్‌ఫైజ్‌ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. సర్పంచ్‌గా తనను మంచి మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు సేవచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ వైఎస్సార్‌సీపీ నాయకులు కాటసాని ప్రసాదరెడ్డి, కాటసాని తిరుపాల్‌రెడ్డి, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబులరెడ్డి, లీగల్‌ సెల్‌ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి అబ్దుల్‌ ఖైర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు గోపాల్‌రెడ్డి, తాహీర్‌, కూరగాయల రహీమాన్‌, సిద్ధంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

పోలీసుల ఆంక్షలు

నామినేషన్‌ కేంద్రం వద్దకు వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే కాటసాని ఇంటి వద్దకు ఎస్‌ఐ దుగ్గిరెడ్డి పోలీసులతో వచ్చారు. నామినేషన్‌ కేంద్రం వద్దకు వెళ్లకూడదని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. నామినేషన్‌ దాఖలు చేస్తున్న అభ్యర్థికి తాను సాక్షి సంతకం చేయాలని, తప్పనిసరిగా వెళ్లాల్సి ఉందని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి నామినేషన్‌ కేంద్రం వద్దకు వెళ్లారు. నామినేషన్‌ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులకు కూడా పోలీసులు ఆంక్షలు విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement