జెడ్పీ చైర్మన్‌గా షేక్‌ బుర్హానుద్దీన్‌ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్‌గా షేక్‌ బుర్హానుద్దీన్‌

Nov 21 2026 2:56 AM | Updated on Nov 21 2026 2:56 AM

● వైస్‌ చైర్మన్‌గా శ్రీకాంత్‌ రెడ్డి

ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు దేసు వెంకటరామిరెడ్డి, కృష్ణమూర్తి, నరసింహుడు, శ్రీదేవి, జయపాల్‌

నంద్యాల(అర్బన్‌): నంద్యాల జిల్లా పరిషత్‌ నూతన చైర్‌పర్సన్‌గా షేక్‌ బుర్హానుద్దీన్‌, వైస్‌ చైర్మన్‌గా శ్రీకాంత్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంతకు ముందు జిల్లా పరిషత్‌ సాధారణ ఎన్నికల్లో 28 జిల్లా పరిషత్‌, ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఎన్నికై న సభ్యులతో జిల్లా పరిషత్‌ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ప్రమాణస్వీకారం చేయించారు. తెలుగు అక్షరమాల క్రమంలో సభ్యులను వేదికపైకి ఆహ్వానించి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటూ తమకు అప్పగించిన బాధ్యతలను నిష్టతో నిర్వహిస్తామని సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం మొత్తం 28 మంది జెడ్పీటీసీ సభ్యులకు గాను 23 మంది సభ్యులు సమావేశానికి హాజరు కావడంతో అవసరమైన కోరం ఉందని బనగానపల్లె జెడ్పీటీసీ సభ్యులు బుర్హానుద్దీన్‌ పేరును పాణ్యం జెడ్పీటీసీ ప్రతిపాదించారు. ఇందుకు బేతంచెర్ల జెడ్పీటీసీ సభ్యుడు బలపరిచారు. ఇతర సభ్యుల నుంచి ఎలాంటి నామినేషన్లు లేకపోవడంతో బుర్హానుద్దీన్‌ను జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అదే విధంగా వైస్‌ చైర్మన్‌ పదవికి శిరివెళ్ల జెడ్పీటీసీ శ్రీకాంత్‌రెడ్డి పేరును చాగలమర్రి జెడ్పీటీసీ సభ్యుడు ప్రతిపాదించగా ఆళ్లగడ్డ జెడ్పీటీసీ సభ్యుడు బలపరిచారు. ఇతర ప్రతిపాదనలు లేకపోవడంతో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా శ్రీకాంత్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. నూతనంగా ఎన్నికై న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తో జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గౌరుచరితా రెడ్డి, గిత్తాజయసూర్య, జిల్లా పరిషత్‌ సీఈఓ శివశంకర్‌, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement