వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడిపై టీడీపీ మూకల దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడిపై టీడీపీ మూకల దాడి

Nov 20 2026 1:43 AM | Updated on Nov 20 2026 1:43 AM

● నామినేషన్‌ వేయకుండా

అడ్డుకునేందుకు కుట్ర

కోవెలకుంట్ల: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం లేక అధికార టీడీపీ అడ్డదారులను వెతుక్కుంటోంది. నామినేషన్లు వేయకుండా భయభాంత్రులకు గురి చేసేందుకు టీడీపీ మూకలు ప్రయత్నిస్తున్నారు. కోవెలకుంట్ల మండలం కంపమల్లకు చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడిపై గురువారం సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. బాధితుడు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల హసన్‌ ఉసేన్‌ గ్రామంలోని 1వ వార్డుకు వైఎస్సార్‌సీపీ మద్దతు దారుడిగా నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన మహిళలు వివిధ వార్డులకు నామినేషన్లు వేసేందుకు కారులో బయలుదేరారు. హసన్‌ ఉసేన్‌ కారు డ్రైవర్‌ కావడంతో వారందరిని కారులో ఎక్కించుకుని భీమునిపాడులోని నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్నారు. మహిళా అభ్యర్థులు వారి నామినేషన్లు వేసి కేంద్రం నుంచి బయటకు వచ్చారు. హసన్‌ఉసేన్‌ నామినేషన్‌ వేసేందుకు వెళుతుండగా రెండు వాహనాల్లో వచ్చి పక్కనే మాటు కాసిన ఇదే గ్రామానికి చెందిన సురేష్‌కుమార్‌రెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, కృష్ణమోహన్‌, క్రిష్ణయ్య, హసన్‌బాష, బ్రహ్మం ఆచారి, చిన్న ఓబులేసులు దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడిగా నామినేషన్‌ వేయడానికి రావడమే కాకుండా మరికొంత మంది మహిళలను నామినేషన్లు వేయించేందుకు తీసుకొస్తావంటూ దుర్భాషలాడుతూ తల, చాతీపై కొట్టారు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు లోకేశ్వరరెడ్డి, వెంకటేశ్వరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు నామినేషన్‌ కేంద్రానికి వెళ్లారు. దాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement