● ఎంపీపీ పామిరెడ్డి జగదీశ్వరమ్మ
గోస్పాడు: స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశంలో గురువారం ఎంపీపీ, ఉప మండల అధ్యక్షుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గెలుపొందిన అభ్యర్థులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీగా పామిరెడ్డి జగదీశ్వరమ్మ, ఉపమండల అధ్యక్షుడుగా మగ్బుల్ హుస్సేన్ ఎంపికై నట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు కో–ఆప్షన్ మెంబర్ ఎన్నిక తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ పామిరెడ్డి జగదీశ్వరమ్మ మాట్లాడుతూ.. తమ గెలుపులో భాగమైన ప్రజలందరికీ రుణపడి ఉన్నామన్నారు. ఇది ప్రజా విజయంగా భావిస్తున్నామని తెలిపారు. ఎంపీడీవో శివప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో రామ కిశోర్, సిబ్బంది, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు పామిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


