శ్రీశైలం: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లకు బుధవారం హైదరాబాద్‌కు చెందిన కొత్త వెంకట్ రెడ్డి, అర్చన రెండు వెండి చెంబులు, పంచహారతి తీర్థం గిన్నె ఉద్దరిణలను సమర్పించారు. ఈ వస్తువుల బరువు 740 గ్రాములు ఉన్నట్లు దాతలు తెలిపారు. వేద పండితులు గంటి రాధాకష్ణశర్మ, పర్యవేక్షకులు హరికృష్ణ రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సుబ్బరాయుడు సమక్షంలో దేవస్థానానికి వెండి వస్తువులను అందజేశారు. దాతలకు రసీదు ఇచ్చి స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలను అందజేశారు.
డీజే పాట మార్చమన్నందుకు కత్తితో దాడి
డోన్ టౌన్: పెండ్లి ఊరేగింపులో డీజేలో పాట మార్చమని అడిగినందుకు కత్తితో దాడి చేసి గాయపరచిన సంఘటన చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గోసానిపల్లె గ్రామంలో ఈ నెల 16వ తేదీన పెండి ఊరేగింపు జరుగుతుండగా అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దళవాయి మధు డీజేలో తనకు ఇష్టమైన పాట పెట్టాలని డీజే నిర్వాహకులు అన్నదమ్ములైన మహేష్, శివకృష్ణతో గొడవ పడగా పెండ్లివారు సర్ది చెప్పారు. మరుసటి రోజు మంగళవారం గ్రామ సమీపంలో మధు గొర్రెలు మేపుతుండగా మహేష్ కత్తితో దాడి చెయ్యగా తమ్ముడు శివకృష్ణ తోడుగా ఉన్నాడు. ఈ దాడిలో మధు వీపుపై గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బుధవారం బాధితుడి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


