రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
డోన్ టౌన్: ఉడుములపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి స్కూటీ ఢీకొట్టడంతో వడ్డె సుశాంత్ (15) మృతి చెందగా అతని స్నేహితుడు మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని తాటిమానుకొత్తూరుకు చెందిన వడ్డె సుశాంత్ కుటుంబం పట్టణంలోని కొండపేటలో నివాసం ఉంటోంది. బుధవారం సుశాంత్ స్నేహితుడు దొరపల్లె గ్రామానికి చెందిన మహేష్‌తో కలిసి స్కూటీపై డోన్ నుంచి ఉడుములపాడు గ్రామం వైపు వెళుతూ జాతీయ రహదారిపై ఉన్న హోటల్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సుశాంత్ అక్కడిక్కడే మృతి చెందగా, మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సుశాంత్ 8వ తరగతి చదువుచుండగా, తండ్రి గతంలో మరణించాడు, గాయపడిన మహేష్‌ను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
మృతి చెందిన సుశాంత్, గాయపడిన మహేష్


