మందుబాబుకు ఝలక్‌ | - | Sakshi
Sakshi News home page

మందుబాబుకు ఝలక్‌

Nov 19 2026 3:19 AM | Updated on Nov 19 2026 3:19 AM

డోన్‌ టౌన్‌: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టణ పోలీసులకు పట్టుబడిన మందుబాబుకు మూడు రోజులు సాధారణ జైలు శిక్ష విధిస్తూ జడ్జి నూరుల్లా తీర్పు వెలువరించినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన ఎరుకల సాయికుమార్‌ మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం పోలీసులు కోర్టులో హాజరుపరచగా విచారణ జరిపిన న్యాయమూర్తి నూరుల్లా మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ ఇంతియాజ్‌ బాషా తెలిపారు.

చిన్నారికి పాముకాటు

కొలిమిగుండ్ల/అవుకు: అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారికి పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం అవుకు మండలం పిక్కిళ్లపల్లె తండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామకృష్ణ నాయక్‌, లక్ష్మీదేవిబాయి దంపతుల కుమార్తె జాహ్నవి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం తర్వాత బయట ఉన్న సమయంలో పాము కాటు వేసింది. అంగన్‌వాడీ ఆయా విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయడంతో చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాగా అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనంతో పాటు కార్యకర్త లేక ఆయానే చూసుకుంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. శాశ్వత భవనం నిర్మించాలని అధికారులను కోరుతున్నారు.

న్యాయ అధికారులకు

నగదు రహిత వైద్యసేవలు

కర్నూలు: జిల్లాలో జ్యుడీషియల్‌ ఆఫీసర్ల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ పోస్టర్లను బుధవారం ఇన్‌చార్జ్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా న్యాయమూర్తులు, న్యా యాధికారులు, వారి కుటుంబ సభ్యులకు ప్రైవే టు ఆసుపత్రుల్లో ఇన్‌, ఔట్‌ పేషెంట్‌ వైద్యసేవ లు నగదు రహితంగా అందుతాయని తెలిపారు. క్లెయిమ్‌లు, చెల్లింపుల విధానాలపై జిల్లా జడ్జి వాసు సూచనలు చేశారు. ఇందులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు సంధ్యారాణి, సరోజినమ్మ, అపర్ణ, అనూష, అనిల్‌ కుమార్‌, స్రవంతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వర ప్రసాద్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని వృద్ధుడి మృతి

కోవెలకుంట్ల: మండలంలోని క లుగొట్ల గ్రామ సమీపంలో బుధవారం ఓ గుర్తు తెలియని వృద్ధు డు మృతిచెందినట్లు రేవనూరు ఎస్‌ఐ ధనుంజయలు తెలిపారు. మృతుడికి 80 సంవత్సరాల వయస్సు ఉంటుందని, గల్లచొక్కా, నీలంకలర్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడన్నారు. మృతుడు ఎక్కడి నుంచో కలుగొట్లకు వచ్చి రెండు నెలల నుంచి భిక్షాటనతో జీవనం సాగిస్తూ మృత్యువాత పడ్డాడన్నారు. మృతుడి గురించి వివరాలు తెలిసిన వారు 91211 01175 ఫోన్‌ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

డోన్‌ రైల్వేస్టేషన్‌లో

గుర్తుతెలియని మృతదేహం

డోన్‌ రూరల్‌: పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. 2వ ప్లాట్‌ఫాంపై 2వ పిల్లర్‌ సమీపంలో సుమారు 60 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు బుధవారం రైల్వే ఎస్‌ఐ బిందుమాధవి తెలిపారు. మృతుడు ఆవాల రంగు (మస్తర్డ్‌ కలర్‌) ఫుల్‌ హ్యాండ్స్‌ షర్ట్‌ ధరించి ఉన్నాడని, దానిపై నలుపు రంగు ప్రింటింగ్‌ గుర్తులు ఉన్నాయిన్నారు. అలాగే కాషాయం రంగు పంచె ధరించి ఉన్నాడని, పక్కన కాషాయం రంగు టవల్‌ కూడా ఉందని, మృతుడి వివరాలు తెలిసిన వారు డోన్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ 92475 75610 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

22న క్రికెట్‌ ఎంపిక పోటీలు

కర్నూలు (టౌన్‌): స్థానిక స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియంలోని నెట్స్‌లో ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు అండర్‌–12 బాలుర క్రికెట్‌ జట్టుకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దేవేందర్‌ గౌడ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2014 సెప్టెంబర్‌ 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు ఆధార్‌ కార్డుతో ఎంపిక పోటీలకు హాజరు కావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement