బెలుం ఉత్సవాలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

బెలుం ఉత్సవాలకు ఏర్పాట్లు

Nov 19 2026 3:19 AM | Updated on Nov 19 2026 3:19 AM

కొలిమిగుండ్ల: పర్యాటకులను కనువిందు చేసే బెలుం గుహల ఉత్సవాలు అతి త్వరలో నిర్వహించేందుకు పర్యాటక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం టూరిజం డీవీఎం లక్ష్మీనారాయణ, డీటీఓ సునీల్‌ కన్నా బెలుం గుహలను సందర్శించి అభివృద్ధి, సుందరీకరణ పనులపై చర్చించి గుహల యూనిట్‌ మేనేజర్‌ కిషోర్‌కు పలు సూచనలు చేశారు. గుహల ప్రాంగణంలోని బుద్ధుని విగ్రహానికి పెయింటింగ్‌తో పాటు పరిసర ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దే చర్యలు చేపడుతామన్నారు. కొండపై రాళ్లతో రూపొందించిన బెలుం గుహల పేరు పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సిబ్బందికి సూచించారు. ఏర్పాట్లను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గుహల ఉత్సవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ త్వరలో తేదీ ఖరారు చేస్తారని చెప్పారు.

బోటింగ్‌ పునరుద్ధరణకు చర్యలు

అవుకు రిజర్వాయర్‌లో బోటింగ్‌, రెస్టారెంట్‌ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు డీవీఎం లక్ష్మీనారాయణ అన్నారు. బనగానపల్లె రూరల్‌ సీఐ మంజునాథరెడ్డితో కలిసి బోటింగ్‌ క్లబ్‌ను పరిశీలించారు. 2023 నవంబర్‌ నుంచి బోటింగ్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయని వాటిని పునరుద్ధరించే చర్యలు జరుగుతున్నాయన్నారు. బోటింగ్‌ క్లబ్‌, రెస్టారెంట్‌ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పిటిషనర్‌తో చర్చించి ప్రస్తుతం ఉన్న స్టే ఉత్తర్వులను తొలగించే విధంగా చర్యలు తీసుకొని త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement