పత్తికొండ: గిరిజన గ్రామాల్లో నాటుసారా విక్రేతలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎకై ్సజ్ సీఐ సువర్ణలత తెలిపారు. బుధవారం పత్తికొండ, తుగ్గలి మండలాల పరిధిలోని జీవరాళ్లమలతండా, పెండ్లిమాన్తండా, చెరువుతండాలలో దాడులు నిర్వహించి నాటుసారా తయారీకి వినియోగించే 1050 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో అల్లర్ల నివారణ కోసం కర్నూల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతురావు, డీసీ సాదు సుధీర్‌బాబు ఆదేశాలతో నాటుసారా కేంద్రాలపై దాడులు చేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని గిరిజన గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచి వచ్చిన సమాచారంతో జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన టీమ్‌తో విస్తృతంగా దాడులు చేపడుతున్నట్లు తెలిపారు. నాటుసారా విక్రేతలు వరుసగా పట్టుబడి కేసులు నమోదైతే భవిష్యత్‌లో వారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు. దీంతో కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుందన్నారు. కావున నాటుసారా అమ్మకాలు నిలిపి వేసి ఇతర వృత్తుల ద్వారా జీవనోపాధి పొందాలన్నారు. దాడుల్లో కర్నూలు, పత్తికొండ ఎకై ్సజ్‌శాఖ టీమ్ సీఐ కిషోర్‌కుమార్, ఏస్ఐలు ప్రవీణ్‌నాయక్, కళ్యాణ్సాయి, జయసూర్య, మధుసూదన్‌రెడ్డి, తేజ తదితరులు పాల్గొన్నారు.


