నాకు తొమ్మిదెకరాల పొలం ఉంది. అందులో పత్తి, మిరప, శనగ, చెరకు, తదతర పంటలు సాగుచేశా. తీవ్ర కరువుతో ఒక్క పంట కూడా చేతికందలేదు. పంట నష్టపరిహారం కింద బీమా నమోదు చేసుకున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. – నజీర్ అహ్మద్, పడమర ప్రాతకోట,
పగిడ్యాల మండలం
నాకున్న ఐదు ఎకరాల పొలంలో మూడెకరాల్లో ఆముదం, రెండెకరాల్లో వేరుశనగ వేశాను. వర్షాలు లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయి. పెట్టుబడి కింద రూ.1.50లక్షలు ఖర్చు చేశాను. పంట ఎండిపోవడంతో ఈ అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత వరకు నష్టపరిహారం కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం.
–తిమ్మారెడ్డి, కాముగానికుంట్ల, డోన్ మండలం


