ముగిసిన మొదటి విడత నామినేషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన మొదటి విడత నామినేషన్ల పర్వం

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

సాక్షి, నంద్యాల: పంచాయతీ పోరులో మొదటి విడత నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసింది. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మొదటి రోజు ఆదివారం అంతగా ఆసక్తి చూపని అభ్యర్థులు రెండో రోజు సోమవారం ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి మూడో రోజు మంగళవారం ఆయా పార్టీల మద్దతుదారులు హడావుడిగా నామినేషన్లు వేశారు. జిల్లాలో మొదటి విడతగా 8 మండలాల్లో 136 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు, 1,370 వార్డుమెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సర్పంచ్‌ స్థానాలకు 967 నామినేషన్లు, వార్డు మెంబర్‌ స్థానాలకు 3,095 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు నామినేష న్ల సమయం ముగియడంతో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలకు బారులు తీరారు. యథావిధిగానే తీరుమారని టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. చాగలమర్రి మండలంలోని నేలంపాడు గ్రామంలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడిచేసి గాయపరిచారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది ఇంటి వద్ద ఉన్న మాజీ సర్పంచ్‌ ప్రతాపరెడ్డిని పరామర్శించడానికి కొన్నిరోజుల ముందు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రతాపరెడ్డి వచ్చారు. పరామర్శ అనంతరం తిరిగి వెళ్తుండగా టీడీపీ నాయకులు కారుకు ట్రాక్టర్‌ను అడ్డుపెట్టారు. ఈ క్రమంలో గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు నాగేశ్వరరావు, మరికొంతమంది వెళ్లి ట్రాక్టర్‌ను పక్కతీశారు. దీంతో కక్షగట్టిన టీడీపీ గుండాలు మంగళవారం పొలం వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు నాగేశ్వరరావును కాపు కాచి ఐదుగురు పచ్చగుండాలు దాడి చేశారు.

టీడీపీ రెబల్స్‌ నామినేషన్ల చించివేత..

పంచాయతీ పోరులో తమకు ఎవరైనా అడ్డొస్తే చాలు సొంతవారినైనా వదిలిపెట్టడం లేదు టీడీపీ నాయకులు. నామినేషన్ల చివరిరోజున ఉయ్యాలవాడ మండలం మాయలూరు సచివాలయం వద్ద గోవిందపల్లెకు చెందిన టీడీపీ రెబెల్‌ మద్దతుదారుడు గడ్డం దీక్షిత్‌రెడ్డి నామినేషన్‌ వేసేందుకు వచ్చాడు. ఇది నచ్చని టీడీపీ వర్గీయులు దీక్షిత్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలు చించివేశారు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చాలా చోట్ల వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు మిక్కిలిగా నామినేషన్లు వేస్తుండటంతో టీడీపీ వర్గీయులకు మింగుడుపడటం లేదు. మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి అత్యధిక శాతం ఓట్లు రావడంతో కూటమి నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

నేటి నుంచి రెండో విడత నామినేషన్లు...

రెండో విడతో బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాల్లోని 11 మండలాల్లోని 195 పంచాయతీలకు, 1982 వార్డు మెంబర్లకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 90 చోట్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి విడత, రెండో విడత వెంటవెంటనే ఉండటంతో టీడీపీ గూండాలు ఎక్కడ దాడి చేస్తారేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

సర్పంచ్‌ స్థానాలకు 967, వార్డుమెంబర్‌

స్థానాలకు 3,095 నామినేషన్లు దాఖలు

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బరితెగించిన టీడీపీ గూండాలు

వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఉత్సాహంగా బరిలోకి..

నేటి నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement