మహానంది: కార్తీకమాసం సందర్భంగా మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఏఎస్పీ ఆర్.సుస్మిత ఆదేశించారు. మహానంది క్షేత్రానికి మంగళవారం రాత్రి వచ్చిన ఆమె ఏఈఓ ఎరమల మధు, ఎస్‌ఐ ఎల్.శివాంజల్, సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ నెల 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు వస్తారని, ఎలాంటి తొక్కిసలాటలు, తోపులాటలు లేకుండా చూసుకోవాలన్నారు. దర్శనం టికెట్ల కౌంటర్, ప్రసాదాల కౌంటర్ వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్తీకమాసం పురస్కరించుకుని మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించిన ఏర్పాట్లు, తీసుకున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. దర్శనం అనంతరం ఏఎస్పీ సుస్మితకు ఆలయ అధికారులు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
హుండీ ఆదాయం
రూ. 32.31 లక్షలు
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలిసిన చౌడేశ్వరిదేవి దేవస్థానంలో హుండీ ఆదాయం రూ.32,,31,488 వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ ఏడాది జూలై 24వ తేదీ నుంచి ఈనెల 17వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన కానుకల ద్వారా ఈ ఆదాయం వచ్చింది. అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన హుండీలో రూ.76,826 రావడం జరిగిందని, అలాగే ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో 34.800 గ్రాముల బంగారు వస్తువులు, 490.200 గ్రాముల వెండి వస్తువులు కానుకలుగా వచ్చాయన్నారు. హుండీ కానుకల లెక్కింపు పర్యావేక్షణాధికారిగా డివిజన్ తనిఖీ అధికారి హరిశ్చంద్రారెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులు, నంద్యాల బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
అన్నపూర్ణ భవన్‌కు
పచ్చళ్ల విరాళం
శ్రీశైలం: దేవస్థానం నిర్వహిస్తున్న అన్నపూర్ణ భవన్ నిత్యాన్నదానశాలకు కర్నూలుకు చెంది న ఆర్ తేజేశ్వర్, హైదరాబాద్‌కు చెందిన కె.నరేంద్రరెడ్డి, యం. చంద్రశేఖరగౌడ్ పలు రకాల పచ్చళ్లను విరాళంగా సమర్పించారు.500 కేజీల పండుమిర్చి, 1000 కేజీల మామిడికాయ పచ్చళ్లను అన్నప్రసాద వితరణలో భక్తులకు వడ్డించేందుకు వారు అందజేశారు. వీటి విలువ సుమారు రూ. 3.60 లక్షల దాకా ఉంటుందని దాతలు తెలిపా రు. కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ సహా య కార్యనిర్వహణాధి కారి ఎం.హరియానాయక్, పర్యవేక్షకులు సీహెచ్.కోమలి, అన్నప్రసాదవితరణ గుమాస్తా చంద్రశేఖరరెడ్డి ఉన్నారు.
మందుబాబులకు జైలు శిక్ష
డోన్ టౌన్: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టణ పోలీసులకు పట్టుబడిన మందుబాబులకు జడ్జి ఒక్కొక్కరికి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. పట్ట ణంలోని కొండపేటకు చెందిన బోయ సు నీల్, బోయ రంగనాయకులు, ఇందిరానగర్‌కు చెందిన బాణాల యశ్వంత్ కుమార్ మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకోని కేసు నమో దు చేసారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరచగా విచారించిన న్యా యమూర్తి నూరుల్లా ఒక్కొక్కరికి మూడు రోజు లు జైలు శిక్ష విధించినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. అలాగే రూరల్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన కర్నూలు పట్టణానికి చెందిన శ్రీనివాసులుకు రెండు రోజు ల జైలు శిక్ష పడినట్లు రూరల్ సీఐ రాకేష్ తెలిపారు.
ధ్రువీకరణ కమిటీల ఏర్పాటు
నంద్యాల(న్యూటౌన్): గ్రేడ్–1 ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు ముసాయిదా సినీయార్టీ జాబితాపై అభ్యంతరాలు, సవరణలు, అప్పీళ్లను పరిశీలించి ధ్రువీకరించేందుకు డివిజన్, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసినట్లు డీఈఓ జనార్ధన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ స్థాయి పరిశీలనలో డిప్యూటీ డీఈఓ చైర్‌పర్సన్, సభ్యులుగా హెచ్‌ఎం గ్రేడ్–2, 1, హెచ్‌ఎం గ్రేడ్–2లను నియమించినట్లు తెలిపారు. జిల్లా స్థాయి పరిశీలన కమిటీలో చైర్‌పర్సన్‌గా డీఈఓ, సభ్యులుగా అసిస్టెంట్ డైరెక్టర్, మరో సభ్యులుగా డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్‌లను నియమించినట్లు తెలిపారు. సీనియారిటీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే తగిన ధ్రువీకరణ పత్రాలతో జిల్లా డీఈఓ కార్యాలయంలో డివిజన్ కమిటీ అధికారులకు సంప్రదించాలన్నారు.


