ప్లీజ్‌ పోటీ చేయండి | - | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ పోటీ చేయండి

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

వార్డు మెంబర్ల అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషణ

మూడు సెంట్ల స్థలం, రూ.లక్ష అడ్వాన్స్‌ అంటూ ఆఫర్‌

మేజర్‌ పంచాయతీ కానాలలో టీడీపీకి వింత పరిస్థితి

ఆఫర్లతో నామినేషన్లు దాఖలు చేయించిన వైనం

నంద్యాల(అర్బన్‌): పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకులకు విచిత్రకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. నామినేషన్లు వేసేందుకు వార్డు మెంబర్లు దొరకక భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తక్కువ ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీల్లో బలవంతంగా ఎవరినో ఒకరిని నామినేషన్లు వేయించగా పెద్ద పంచాయతీల్లో భారీ ఆఫర్లతో నామినేషన్లు వేయించినట్లు తెలుస్తోంది. మండల మేజర్‌ పంచాయతీ కానాల గ్రామంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో రెండు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ హవాను తట్టుకొని నిలబడేందుకు వార్డు మెంబర్లు సైతం పోటీలో నిలిచేందుకు ఉత్సాహం చూపడం లేదు. టీడీపీ మద్దతుతో పోటీలో నిలిచి పరువుతో పాటు డబ్బును పోగొట్టుకోవాల్సి వస్తుందని భావించిన పలువురు వార్డు మెంబర్ల స్థానాలకు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపడం లేదని సమాచారం. ఎలాగైనా వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేయాలన్న నిబంధనల మేరకు టీడీపీ నాయకులు పోటీ చేసే అభ్యర్థులకు భారీ ఆఫర్లు పెట్టినట్లు తెలుస్తోంది. 3 సెంట్ల స్థలంతో పాటు రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇస్తామంటూ నమ్మబలకడంతో కొన్ని వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేసిన పలువురు వార్డు మెంబర్లకు బైండోవర్‌ కేసులంటూ పోలీసుల చేత భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్ని అవాంతరాలు సృష్టించినా కానాల మేజర్‌ పంచాయతీలో మరోసారి వైఎస్సార్‌సీపీ మద్దతు దారులదే విజయమని గ్రామస్తులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement