మాజీ ఎమ్మెల్యే శిల్పా
నంద్యాల(వ్యవసాయం): పట్టణ ప్రజల ఆశీర్వాదంతో శిల్పా కుటుంబం ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటూ సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి అన్నారు. స్థానిక శిల్పా సేవాసమితి కార్యాలయంలో మంగళవారం శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా లబ్ధిదారులైన 121 మంది మహిళలకు మొత్తం రూ.21.77 లక్షల విలువైన ఆర్థిక సహాయం (చెక్కులను) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, బ్యాంక్ చైర్‌పర్సన్ నాగిని రవిసింగారెడ్డి హాజరయ్యా రు. వీరితో పాటు మహిళా బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా రవి, నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా శిల్పా కుటుంబం నంద్యాల ప్రజలకు నిస్వా ర్థంగా సేవలు అందిస్తోందని గుర్తుచేశారు. తాము చేస్తున్న మంచిని ఓర్వలేక, అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న కొందరు వ్యక్తులు తమ ‘శిల్పా సహకార్ సూపర్ మార్కెట్’ సేవలను స్తంభించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సూపర్ మార్కెట్‌ను ఖాళీ చేయించిన ఆ స్థానంలో కేవలం ఆరు నెలల పాటు ఒక్క షాప్‌ను మాత్రమే నిర్వహించడం గమనార్హమని, ఇది తమపై ఉన్న రాజకీయ కక్ష కాదా? అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో శిల్పా కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకున్న వారికి ప్రజలు ఓటుతో తగిన తీర్పునిచ్చి బుద్ధి చెప్పారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఎప్పుడూ మంచి చేసేవారికే పట్టం కడతారని స్పష్టం చేశారు.
రవిచంద్ర కిశోర్ రెడ్డి


