ప్రచారానికి తెరతీసిన అభ్యర్థులు | - | Sakshi
Sakshi News home page

ప్రచారానికి తెరతీసిన అభ్యర్థులు

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

అభ్యర్థులు మెంబర్లు

ఒక పక్క నామినేషన్ల గడువు తీరకముందే సర్పంచ్‌ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థులు ప్రచారం షురూ చేశారు. నంద్యాల, గోస్పాడు, ఆళ్లగడ్డలో ఇంటింటికి తిరుగుతూ వరుసలు కలుపుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగం నిమిత్తం వేరే ఊళ్లల్లో ఉన్న ఓటర్ల రాకపోకలకు సంబంధించిన ఖర్చులన్నీ భరించడానికి కొందరు అభ్యర్థులు సిద్ధమయ్యారు.

గోస్పాడులో రాయపాడు సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేస్తున్న చెన్నూరు మధుసూదన్‌, ముత్యాలపాడు సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేస్తున్న సుబ్బారాయుడు

సాక్షి, నంద్యాల: పంచాయతీ ఎన్నికల పోరు రోజురోజుకూ వేడెక్కుతోంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు సోమవారం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. మొదటి విడతలో భాగంగా నంద్యాల, గోస్పాడు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లో 136 పంచాయతీలు, 1,332 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి రోజు నామినేషన్ల దాఖలు మందకొడిగా సాగింది. సర్పంచ్‌ స్థానాలకు 160, వార్డు స్థానాలకు 413 నామినేషన్లు వచ్చాయి. అయితే, రెండోరోజు సోమవారం నామినేషన్లు ఊపందుకున్నాయి. సర్పంచ్‌ స్థానాలకు 424 మంది, వార్డు స్థానాలకు 1,535 మంది నామినేషన్లు వేశారు. ఇందులో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు సమరోత్సాహంతో నామినేషన్లు వేశారు.

మంత్రి ఫరూక్‌కు

ఝలక్‌ ఇచ్చిన అనుచరులు..

మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరకున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా లోగడ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. సమన్వయ లోపం కారణంగా ఆ పార్టీ శ్రేణులు గ్రూపులుగా విడిపోయాయి. సోమవారం పంచాయతీ నామినేషన్ల దాఖలు సమయంలో ఇది రుజువైంది. నంద్యాల మండలంలోని చాబోలు, మిట్నాల తదితర గ్రామాల్లో మంత్రి ఫరూక్‌ ముఖ్య అనుచరులు ఆయనతో విభేదించి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఉయ్యాలవాడ మండలం డి. కొత్తపల్లెలో జనసేన పార్టీ మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. దీని ప్రకారం చూస్తే కూటమి పార్టీలో సమన్వయం లేదని తెలుస్తోంది. అలాగే సర్పంచ్‌లకు పోటీ చేసేందుకు కూడా టీడీపీ మద్దతుదారులు చాలా చోట్ల ముందుకు రావడం లేదని సమాచారం. తాజా ఎన్నికల్లో టీడీపీకి తగిలిన దెబ్బ పంచాయతీ ఎన్నికల్లో కూడా పునరావృతమవుతుందేమోనని భయపడుతున్నట్లు సమాచారం. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల గడువు నేటి (మంగళవారం)తో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల మద్దతుదారులు నేడు హడావుడి చేయనున్నారు. ఇదిలా ఉండగా పంచాయతీలకు పోటీలో ఉన్న వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులపై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. టీడీపీ నాయకులు వారిని అడ్డం పెట్టుకొని అభ్యర్థులను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

రెండో రోజు నామినేషన్ల వివరాలు

మండలం సర్పంచ్‌ వార్డు

నంద్యాల 83 259

గోస్పాడు 43 183

ఉయ్యాలవాడ 45 197

రుద్రవరం 75 245

శిరివెళ్ల 43 172

చాగలమర్రి 54 189

ఆళ్లగడ్డ 46 164

దొర్నిపాడు 35 126

మొత్తం 424 1,535

రెండోరోజు సర్పంచ్‌ స్థానాలకు

424, వార్డు స్థానాలకు 1,535 మంది

నామినేషన్ల దాఖలు

ఉత్సాహంగా నామినేషన్లు వేసిన

వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు

డైలమాలో టీడీపీ నాయకులు

నేడు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ

నంద్యాలలో మంత్రి ఫరూక్‌కు

రెబల్స్‌గా మారిన నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement