బేతంచెర్ల: మద్దిలేటి నరసింహస్వామి క్షేత్ర పరి సరాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు దేవదాయ , పర్యాటక శాఖలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఉపకమిషనర్ రామాంజనేయులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో పెడల్ బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే నంద్యాల జిల్లా పర్యాటక శాఖ అధికారులు లక్ష్మీ నారాయణ, డాక్టర్ సునీల్ కన్నా సోమవారం ఆలయ పరిసరాలను పరిశీలించారన్నారు. అంతకుముందు ఆ అధికారులను ఆలయ కమిషనర్ స్వాగతం పలికి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి సత్కరించారు.


