29న రెండో విడత పంచాయతీ పోరు | - | Sakshi
Sakshi News home page

29న రెండో విడత పంచాయతీ పోరు

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

● 11మండలాల్లోని 195

గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు

● 18వ తేదీ నుంచి 20 వరకు

నామినేషన్ల స్వీకరణ

● కోర్టులో ఉన్న సున్నిపెంట పంచాయతీ

సాక్షి,నంద్యాల/నంద్యాల (న్యూటౌన్‌): పంచాయతీ రెండోదశ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. మొదటి విడతలో జిల్లాలో నంద్యాల, గోస్పాడు, ఆళ్లగడ్డ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక రెండో విడతలో పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గాలు ఉన్నాయి. మొ త్తంగా 195 పంచాయతీలు, 1982 వార్డులకు ఈనె ల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు 90 చోట్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రా లు, 2,108 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

బనగానపల్లెలో అత్యధింగా

24 పంచాయతీలు..

బనగానపల్లెలో 24 పంచాయతీలు, 262 వార్డులు ఉన్నాయి. కోవెలకుంట్లలో 17 పంచాయతీలు, 168 వార్డులు, కొలిమిగుండ్లలో 23 పంచాయతీలు, 230 వార్డులు, అవుకు 21 పంచాయతీలు, 200 వార్డులు, సంజామల 17 పంచాయతీలు, 164 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడులో 8 పంచాయతీలు, 98 వార్డులు, మహానంది మండలంలో 13 పంచాయతీలు, 140 వార్డులు, ఆత్మకూరులో 17 పంచాయతీలు, 166 వార్డులు, బండి ఆత్మకూరులో 20 పంచాయతీలు, 200 వార్డులు, గడివేముల మండలంలో 16 పంచాయతీలు, 164 వార్డులు, పాణ్యంలో 19 పంచాయతీలు, 190 వార్డులకు ఈ నెల 29వ తేదీన పోలింగ్‌ జరగనుంది. బనగానపల్లెలో అత్యధింగా 24 పంచాయతీలు ఉండగా, అత్యల్పంగా వెలుగోడు మండంలో 8 పంచాయతీలు ఉన్నాయి. సున్నిపెంట పంచాయతీ ఎన్నికలు బ్రేక్‌ పడినట్లే కనిపిస్తోంది. పంచాయతీల భూములు, పన్నుల వివరాలు ప్రకటించకుండా ఎలా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని స్థానిక నివాసి మైలపల్లి నాగరాజు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు మూడు రోజులకు వాయిదా వేసింది. ఆ తర్వాత కోర్టు ఏం చెప్తుందోనని పంచాయతీ ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

● ఈ నెల 18 నుంచి ఉదయం 10.30 గంటల నుంచి 20వ తేది సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

● 21న నామినేషన్ల పరిశీలన, 23న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌కు అవకాశం.

● 24వ తేది మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజున మధ్యాహ్నం 3 గంటల అనంతరం పోటీలోని అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.

● 29వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌

● 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

● అదే రోజున ఉప సర్పంచు ఎన్నిక, ఏవైనా కారణాల రీత్యా ఉప సర్పంచు ఎన్నిక జరగకపోతే మరుసటి రోజున (సెలవు దినం అయినప్పటికీ) ఎన్నిక నిర్వహణ.

● ఎక్కడైనా రీపోలింగ్‌ అవసరమైతే 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement