రుద్రవరం: చిలకలూరుకు చెందిన 15 కుటుంబాలు ఆదివారం టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామానికి చెందిన ఈడిగ రాముడు, ఈడిగ శివగౌడ్, రాజశేఖర్‌గౌడ్, వడ్ల కిట్టుడు, గోపవరం శేషారెడ్డితో పాటు మరో 10 కుటుంబాల వారు స్వచ్ఛందంగా వైఎస్సార్సీసీలో చేరారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ పరిశీలకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వారికి కండువాలు కప్పి వైఎస్సార్సీపీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ప్రసాదరెడ్డి, నాయకు లు కుళాయిరెడ్డి, మహేశ్ రెడ్డి, గొల్ల కృష్ణుడు, రామచంద్రారెడ్డి, సాకలి లింగమయ్య ఉన్నారు.


