● ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డీసీ శ్రీదేవి
డోన్ టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని కర్నూలు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం డోన్ ఎకై ్సజ్ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సారా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. అవసరమైతే బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో నంద్యాల స్క్వాడ్ సీఐ లక్ష్మణ్‌దాసు, డోన్ ఎకై ్సజ్ సీఐ జప్రూల్లా, ఎస్‌ఐలు సోమశేఖర్‌రావు, దౌలత్‌ఖాన్, ట్రైనీ ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, అన్వేష్ సిబ్బంది ఉన్నారు.
ఉత్తమ పురస్కారానికి మోడల్ పాఠశాల ఎంపిక
రుద్రవరం: రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రతిభా పురస్కారానికి రుద్రవరం ఏపీ మోడల్ పాఠశాల ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాల మేరకు.. ప్రభుత్వం, హార్ట్ ఫుల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి నామినేషన్ల ఆధారంగా జిల్లాకు చెందిన రుద్రవరం మోడల్ పాఠశాల ఉత్తమ పురస్కార ప్రతిభా పురస్కారానికి ఎంపికై ంది. పాఠశాలలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, వ్యర్థాల నిర్వాహణ, పచ్చదనం, నీటి సంరక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్య వంటి కార్యక్రమాలు ఈ పురస్కారానికి దోహద పడ్డాయని ప్రిన్సిపాల్ తెలిపారు.
పోస్టల్ బీమా సేవలకు తాత్కాలిక విరామం
నంద్యాల(వ్యవసాయం): నంద్యాల డివిజన్ పరిధిలోని అన్ని పోస్టల్ కార్యాలయాల్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ అప్పలస్వామి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ వ్యవస్థకు మార్పు చేయనున్న నేపథ్యంలో ఈనెల 16 నుంచి 24వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని తెలిపారు. ఈ మార్పిడి ప్రక్రియలో భాగంగా కొత్త బీమా పాలసీల నమోదు, ప్రీమియం చెల్లింపులు, ఇతర ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు నిలిచిపోనున్నాయన్నారు. దీంతో పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ పాలసీదారులు తమ ప్రీమియం చెల్లింపులు, పెండింగ్‌లో ఉన్న ఇతర లావాదేవీలను నవంబర్ 15వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. తిరిగి నూతన ఐఎంఎస్ వ్యవస్థ ద్వారా నవంబర్ 25వ తేదీ నుంచి పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ సేవలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయని తెలిపారు. పాలసీదారులు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా తమ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని, పోస్టల్ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గిరిజన విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించండి
శ్రీశైలంప్రాజెక్ట్: గిరిజన విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించాలని శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పీవీఎస్ నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన శ్రీశైలం ఐటీడీఏ పరిధి లోని మార్కాపురం, పల్నాడు, నంద్యాల జిల్లాలలో ఉన్న గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. వర్చువల్ విధానంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పబ్లిక్ పాజిటివ్ పర్‌ఫెక్షన్ కార్యక్రమం అమలుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా పీఓ విద్యార్థుల విద్యాప్రమాణాలు, అభివృద్ధి, ఆహార నాణ్యత, నిరంతర పర్యవేక్షణ, ఆర్వో ప్లాంట్ల పనితీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలలో ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని పీఓ సూచించారు. సమీక్షా సమావేశంలో మూడు జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు ఎసీమోను, కేజీ నాయక్, పి.రామాంజనేయులు, ఎం.చిన్న నాగరాజు, ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


