నేతల దాహం తీర్చి.. రైతులకు కన్నీళ్లు మిగిల్చి! | - | Sakshi
Sakshi News home page

నేతల దాహం తీర్చి.. రైతులకు కన్నీళ్లు మిగిల్చి!

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

నంద్యాల(అర్బన్‌): సంతజూటూరు పికప్‌ ఆనకట్ట నుంచి ఇటీవల కడప జిల్లా టీడీపికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కేసీ నీటిని ప్రొద్దుటూరు వరకు తీసుకెళ్లినట్లు నంద్యాల మండల రైతులు ఆరోపిస్తున్నారు. అందుకు అధికారులు సహకరించారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కేసీ కాల్వ నుంచి మూడు అడుగుల మేర నీటి పారకం ఉన్నా పొన్నాపురం సబ్‌ చానల్‌కు నీటి ప్రవాహం నిలిచి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌, రబీల్లో సాగు చేసిన వేలాది ఎకరాల పంటలు ఎండు దశకు చేరుకున్నాయి. వ్యయ ప్రయాసాలకోర్చి పంటల సాగు చేపట్టిన రైతన్నలు ఎండుతున్న పంటలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఎండుతున్న పంటలకు సాగునీరు అందించాలని కోరుతూ పలు గ్రామాల రైతులు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం వద్దకు వచ్చి కలెక్టర్‌ రాజకుమారికి సమస్యను వివరించారు. కలెక్టర్‌ స్పందిస్తూ ‘కేసీ నుంచి వచ్చే నీటిలో తాగునీటికి ప్రాధాన్యతను ఇస్తాం, రైతులు అర్థం చేసుకోవాలి. కేసీ కెనాల్‌ అధికారులతో మాట్లాడి సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తామంటూ’ రైతులకు బదులిచ్చారు.

పొన్నాపురం సబ్‌ చానల్‌ కింద

ఎండుతున్న పంటలు...

కేసీ కెనాల్‌ పరిధిలోని పొన్నాపురం సబ్‌ చానల్‌ కింద నంద్యాల మండలంలోని పాండురంగాపురం, సుబ్బారెడ్డి పాలెం, చాపిరేవుల, మిట్నాల, ఏ.శివరాంపురం, బి.శివరాంపురం, రామ్మూర్తి కొట్టాల, గుంతనాల, పుసులూరు, గోస్పాడు మండలంలోని తేళ్లపురి, పసురపాడు, జూలేపల్లె, చింతకుంట్ల, ఎస్‌.కూలూరు తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వరి, మినుము, మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేశారు. వరి పొట్ట దశలో ఉండగా 45 రోజుల క్రితం మినుము, మొక్కజొన్న, జొన్న పంటలు సాగు అయ్యాయి. ఎదుగుతున్న పంటలను చూసి ఆనందం పడుతున్న సమయంలో కేసీలో నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా సాగునీరు సమృద్ధిగా ఉండేది. అయితే ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో సాగునీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఎండుతున్న పంటలను అధికారులకు చూపించినా ప్రయోజనం లేకుండా పోతుందని, పెట్టుబడులు నేలపాలవుతున్నాయని రైతులు వాపోతున్నారు. తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు బసవసుబ్బారెడ్డి, శేషిరెడ్డి, సాంబిరెడ్డి, శేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రవీంద్రారెడ్డిలు కోరారు.

సాగునీటి విడుదలపై పచ్చనేత ఒత్తిళ్లు

కేసీ నీటిని కడప జిల్లాకు

మళ్లించిన అధికారులు

పంటలు ఎండుతుండటంతో

ఆందోళనలో అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement