● బ్యాలెట్ పేపర్‌లో నోటాకు స్థలం
సాక్షి, నంద్యాల: పంచాయతీ బరిలో నిలిచే అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులు ఖరారు చేసింది. సర్పంచ్‌కు పోటీ చేసే అభ్యర్థులకు 25 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించింది. ఇవే కాకుండా ఓటర్లకు నోటా సౌకర్యం ఏర్పాటు చేసింది. జిల్లాలో 488 గ్రామ పంచాయతీలు, 4,906 వార్డులు ఉన్నాయి. మొత్తం 10,84,706 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 169 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 26న మొదటి దశ, 29వ తేదీన రెండోదశ, డిసెంబర్ 2వ తేదీన మూడో దశ పోలింగ్ జరగనునుంది. అసక్తిగల అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. పోటీ చేసే అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. పోటీ చేసేందుకు వయసు 21 ఏళ్లు ఉండాలి. అలాగే పోటీ చేసే గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండకూడదు.అభ్యర్థులు నాలుగు సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలు దాఖలు చేసుకోవచ్చు.
నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు..
నామినేషన్ ఫారం–3 రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి తీసుకోవాలి. అభ్యర్థితో పాటు ప్రపోజర్ సంతకాలు ఉండాలి. ఓటరు కార్డు జిరాక్స్ కాపీపై అభ్యర్థితో పాటు, ప్రపోజర్ సంతకాలు చేయాలి. ప్రపోజర్ అదే గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉండాలి. ఆధార్ జిరాక్స్, నాలుగు నుంచి ఆరు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, వయసు ధ్రువీకరణ పత్రం(పదో తరగతి మార్కుల జాబితా లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం), కుల ధ్రువీకరణ పత్రం (రిజర్వ్‌డ్ సీటు అయితే తప్పనిసరి). జనరల్ సీటు కోసం పోటీ చేసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే డిపాజిట్ తగ్గింపు కోసం కావాలి.
నోడ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి..
పంచాయతీ కారదర్శి నుంచి పంచాయతీకి ఎలాంటి బకాయిలు లేవని ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
అఫడవిట్/ప్రమాణ పత్రం, నేరచరిత్ర, ఆ స్తులు, అప్పులు, చదువు, సంతాన వివరాల తో పాటు ఇద్దరు సాక్షుల సంతకాలు కావాలి.
డిపాజిట్ రసీదు సర్పంచ్‌కు జనరల్ అభ్యర్థులకు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1500 డిపాజిట్ చేయాలి.


